త్రీడీ.. ట్రెండీ..
ఇంటి డోర్, కిటికీ, గోడలకు ఆధునిక హంగులు
నగరవాసుల అభిరుచిలో మార్పులు
మనసును హత్తుకునే డిజైన్లు
చూసేవారు ఔరా అనాల్సిందే
వేడుకల్లోనూ డెకరేషన్.. అదిరెన్..
ఇప్పటి వరకు మనం థియేటర్‌లో త్రీడీ సినిమాలు చూసి ఉండొచ్చు.. కానీ ఇంట్లో కూర్చుని త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? పడక గదిలో నక్షత్ర మండలాన్ని చూశారా? అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్‌లోకి త్రీడీ కిటికీలు, తలుపులు, నక్షత్ర మండలం.. ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. త్రీడీలో సినిమా చూసి అద్భుతమైన అనుభూతిని పొందుతాం. అదే ఇంట్లో త్రీడీ కిటికీలు ఉంటే.. తలుపులు ఉంటే.. నక్షత్రాలు బెడ్రూంలో దర్శనమిస్తే.. ఈ ఊహే మనసును ఎంతో ఉల్లాసపరిచేది ఉంటుంది.
డిజిటల్ ప్రింటింగ్ అరంగ్రేటంతో ప్రతీ దృశ్యం మన కళ్ల ముందే ఉన్నట్లుగా ఉంటుంది. మనకు తెలియని కొత్తప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లు ఉంటుంది. ఇంట్లో కూర్చుని పచ్చని అటవీ అందాలు వీక్షించవచ్చు. సొగసైన జలపాతాలు చూడవచ్చు. క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లు ఫీలు కావచ్చు. గోడలపై బీచ్ రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరిచెట్లూ పెరుగుతున్నట్లు అనిపించవచ్చు. – సాక్షి, సిటీ బ్యూరో
నగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ప్రస్తుతం మార్కెట్‌లో న్యూ ట్రెండ్ ఏం నడుస్తుందని ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. దేశ, విదేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక హంగులపై ఆరా తీస్తున్నారు. తమ అభిరుచులకు తగ్గట్లు వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిటికీలు, తలుపులు, గోడలు, బెడ్రూంలో సరికొత్త డిజైన్లు దర్శనమిస్తున్నాయి. కొంత కాలంగా నచి్చన సీనరీ, చిత్రాలను గోడలకు, విండోస్‌కు స్టిక్కర్ అతికించే పద్ధతి కొనసాగుతోంది.
ఇటీవల మరింత అప్‌గ్రేడ్ అయ్యారు. త్రీడీ టెక్నాలజీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. కస్టమైజ్ బ్లైండ్స్, జీబ్రా బ్లైండ్స్, ఉడెన్ బ్లైండ్స్, పీవీసీ బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కనీసం రూ.200 (ఒక అడుగు) నుంచి గరిష్టంగా రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోకి రూమల్ బ్లైండ్స్‌ను ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తున్నారు. కిటికీలు, డోర్‌లకు పీవీసీ బ్లైండ్స్ వినియోగిస్తున్నారు. ఇంటి యజమాని అభిరుచికి తగ్గట్లు చిత్రాలతో అందుబాటులోకి తెస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మాత్రం సంస్థ లోగో, చేసే పనికి సంబంధించిన థీం చిత్రాలను త్రీడీ టెక్నాలజీలో అనుభూతి పొందుతున్నారు.
రిలాక్స్.. రిలాక్స్
నగరంలో సగటు వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని అలా రిలాక్స్ అవుతున్నారు. ఒత్తిడి నుంచి ఒక్కసారిగా ప్రకృతి ఒడిలోకి ఒదిగిపోయి నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడిపేస్తున్నారు. త్రీడీ టెక్నాలజీ ఎంత బాగుందో కదా.
వేడుకల్లోనూ ఆ సోయగాలే..
త్రీడీ తెరలతో చాలా మంది వేడుకల్ని సైతం సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓ గంట ఫంక్షన్‌కి పూలు, అలంకరణ అంటే అంత ఖర్చు ఎందుకు దండగ అనుకుని త్రీడీ బ్యాక్‌డ్రాప్ స్క్రీన్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక దఫా కొంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. డెకరేటర్లు చేసిన వేదికల ఫొటోలను యథాతథంగా తెరమీదకి తెచ్చేస్తోంది. దీంతో అలంకరణ ఖర్చు తగ్గుతోంది. పూలు లేకుండానే ఫొటోల్లో పూల అలంకరణ కనిపించేస్తుంది. త్రీడీ మాయతో కనువిందు చేస్తున్నాయి.
అప్‌గ్రేడ్ అవుతున్నారు..
నగరంలో ఒకే మోడల్ ఎక్కువ రోజులు వినియోగంలో ఉండదు. మారుతున్న కాలంతో పాటే ఇక్కడి ప్రజల అభిరుచులు మారుతున్నాయి. వాల్‌కి అతికించే ఇమేజ్‌ల నుంచి ప్రస్తుతం త్రీడీ టెక్నాలజీ వరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు.
– దీపక్, డిజైన్ వాల్స్, మియాపూర్
ఇవి చదవండి: చాయ్ చమక్..!
Comments
Please login to add a commentAdd a comment