wall art
-
ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా?
ఇప్పటి వరకు మనం థియేటర్లో త్రీడీ సినిమాలు చూసి ఉండొచ్చు.. కానీ ఇంట్లో కూర్చుని త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? పడక గదిలో నక్షత్ర మండలాన్ని చూశారా? అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్లోకి త్రీడీ కిటికీలు, తలుపులు, నక్షత్ర మండలం.. ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. త్రీడీలో సినిమా చూసి అద్భుతమైన అనుభూతిని పొందుతాం. అదే ఇంట్లో త్రీడీ కిటికీలు ఉంటే.. తలుపులు ఉంటే.. నక్షత్రాలు బెడ్రూంలో దర్శనమిస్తే.. ఈ ఊహే మనసును ఎంతో ఉల్లాసపరిచేది ఉంటుంది. డిజిటల్ ప్రింటింగ్ అరంగ్రేటంతో ప్రతీ దృశ్యం మన కళ్ల ముందే ఉన్నట్లుగా ఉంటుంది. మనకు తెలియని కొత్తప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లు ఉంటుంది. ఇంట్లో కూర్చుని పచ్చని అటవీ అందాలు వీక్షించవచ్చు. సొగసైన జలపాతాలు చూడవచ్చు. క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లు ఫీలు కావచ్చు. గోడలపై బీచ్ రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరిచెట్లూ పెరుగుతున్నట్లు అనిపించవచ్చు. – సాక్షి, సిటీ బ్యూరోనగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ప్రస్తుతం మార్కెట్లో న్యూ ట్రెండ్ ఏం నడుస్తుందని ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. దేశ, విదేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక హంగులపై ఆరా తీస్తున్నారు. తమ అభిరుచులకు తగ్గట్లు వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిటికీలు, తలుపులు, గోడలు, బెడ్రూంలో సరికొత్త డిజైన్లు దర్శనమిస్తున్నాయి. కొంత కాలంగా నచి్చన సీనరీ, చిత్రాలను గోడలకు, విండోస్‌కు స్టిక్కర్ అతికించే పద్ధతి కొనసాగుతోంది.ఇటీవల మరింత అప్‌గ్రేడ్ అయ్యారు. త్రీడీ టెక్నాలజీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. కస్టమైజ్ బ్లైండ్స్, జీబ్రా బ్లైండ్స్, ఉడెన్ బ్లైండ్స్, పీవీసీ బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కనీసం రూ.200 (ఒక అడుగు) నుంచి గరిష్టంగా రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోకి రూమల్ బ్లైండ్స్ను ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తున్నారు. కిటికీలు, డోర్లకు పీవీసీ బ్లైండ్స్ వినియోగిస్తున్నారు. ఇంటి యజమాని అభిరుచికి తగ్గట్లు చిత్రాలతో అందుబాటులోకి తెస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మాత్రం సంస్థ లోగో, చేసే పనికి సంబంధించిన థీం చిత్రాలను త్రీడీ టెక్నాలజీలో అనుభూతి పొందుతున్నారు.రిలాక్స్.. రిలాక్స్నగరంలో సగటు వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని అలా రిలాక్స్ అవుతున్నారు. ఒత్తిడి నుంచి ఒక్కసారిగా ప్రకృతి ఒడిలోకి ఒదిగిపోయి నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడిపేస్తున్నారు. త్రీడీ టెక్నాలజీ ఎంత బాగుందో కదా.వేడుకల్లోనూ ఆ సోయగాలే..త్రీడీ తెరలతో చాలా మంది వేడుకల్ని సైతం సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓ గంట ఫంక్షన్‌కి పూలు, అలంకరణ అంటే అంత ఖర్చు ఎందుకు దండగ అనుకుని త్రీడీ బ్యాక్‌డ్రాప్ స్క్రీన్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక దఫా కొంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. డెకరేటర్లు చేసిన వేదికల ఫొటోలను యథాతథంగా తెరమీదకి తెచ్చేస్తోంది. దీంతో అలంకరణ ఖర్చు తగ్గుతోంది. పూలు లేకుండానే ఫొటోల్లో పూల అలంకరణ కనిపించేస్తుంది. త్రీడీ మాయతో కనువిందు చేస్తున్నాయి.అప్‌గ్రేడ్ అవుతున్నారు..నగరంలో ఒకే మోడల్ ఎక్కువ రోజులు వినియోగంలో ఉండదు. మారుతున్న కాలంతో పాటే ఇక్కడి ప్రజల అభిరుచులు మారుతున్నాయి. వాల్కి అతికించే ఇమేజ్‌ల నుంచి ప్రస్తుతం త్రీడీ టెక్నాలజీ వరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు.– దీపక్, డిజైన్ వాల్స్, మియాపూర్ఇవి చదవండి: చాయ్ చమక్..! -
రంగుల వాల్.. జిగేల్!
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాల్ ప్రాజెక్టులో భాగంగా పలు భవనాలు, ప్రహరీలపై వేసిన బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పాత మున్సిపల్ కార్యాలయంలో సిటీ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ ప్రహరీపై గీసిన పుస్తకాలు, యువతి తదితర చిత్రాలతో పురాతన భవనం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. సిటీ లైబ్రరీతో పాటు ఇతర అభివృద్ధి పనులను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
ట్రెండ్ మారుతోంది.. అలాంటి ఇళ్లే కావాలంట!
పల్లె అందం ఇప్పుడు పట్టణపు ఇళ్లలో కనువిందు చేస్తోంది. పాత తరం ముచ్చట నట్టింట కళాత్మకమై కొలువుదీరుతోంది. డిజటల్ యుగంలో కాంక్రీట్ క్లీనింగ్ బోర్ అనుకున్నవారు మట్టివాసనకు చేరువలో ఉండాలని తపిస్తున్నారు. అందుకే, ఇటుక కనిపించేలా గోడలు, నగిషీలు చెక్కిన వుడ్‌తో ఫర్నిచర్, మసకబారిన బ్రాస్ కలెక్షన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇల్లు, కార్యాలయం, కాఫీషాప్.. వంటి వాటికి ఔట్ సైడ్ బ్రిక్ స్టైల్ డిజైన్స్ చూస్తుంటాం. అయితే, ఇప్పుడిది ఇంటీరియర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పాటే వింటేజ్ స్టైల్ సింపుల్ అండ్ గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకోవడం కూడా ఇప్పుడీ స్టైల్ నగరవాసులకు ప్రియమైన డెకార్‌గా మారింది. నిర్లక్ష్యమే అందం ఇటుకను ప్రకృతిలోని దృశ్యాన్ని ఇంట్లోకి తీసుకువచ్చే ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. గది నాలుగు గోడలలో ఒక గోడను ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఇంటి అలంకరణలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడదే పాత పుంతలను తొక్కుతోంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్లలో ఒక వైపు ఇటుక గోడ రస్టిక్ ఫీల్‌ను ఇస్తుంది. సిమెంట్ తాపీ పని లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారనిపించేలా ఉండే ఎగుడుదిగుడుల ఇటుక గోడ క్రియేటివ్ స్పేస్‌గా మారిపోయింది. ఈ ఇటుక గోడపైన ఓల్డ్ స్టైల్ వాల్ ఫ్రేమ్స్ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వుడెన్ లేదా ఐరన్ ఎలాంటి హంగులు అవసరం లేకుండానే వింటేజ్ లుక్‌ను తీసుకువస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్‌లో ఇటుక ప్రధాన ఆకర్షణగా మారింది. వాల్ పేపర్‌తో వింటేజ్ లుక్ ఇంటి లోపల ఇటుక గోడ పెట్టక్కర్లేదు. రస్టిక్ లుక్ ఉన్న బ్రిక్ స్టైల్ వాల్‌పేపర్‌తో గది గోడను మార్చుకోవడం సులువు అవుతుంది. పెద్దగా ఖర్చూ ఉండదు. మార్చుకోవడం సులువు. అద్దె ఇంట్లోనైనా అనుకున్న లుక్‌ని ఆస్వాదించవచ్చు. ఫ్రేమ్ స్టైల్ బ్రిక్ లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో ఒక ఫ్రేమ్ స్టైల్లోనూ ఇటుక గోడను డిజైన్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల తెల్లటి నున్నని గోడల మధ్య వెడల్పాటి ఇటుక గోడ ఒకటి ఫ్రేమ్స్టైల్లో డిజైన్ చేస్తే కళాత్మకతలో అదొక అందమైన ప్రదేశంగా మారిపోతుంది. సర్కిల్లా గుండ్రటి స్టైల్ మట్టి ఇటుక వచ్చేలా డిజైన్ చేస్తే ఇంటిలోపల యూనిక్ లుక్ కనువిందు చేస్తుంది. ఒక ఆర్ట్ వర్క్‌లా మారిపోతుంది. మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలంటే దీనికి కలపతో డిజైన్ చేసిన హ్యాంగింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. పార్టిషన్ వాల్ హాల్లో కొంత భాగం పార్టిషన్ చేసుకోవాలంటే అందుకు మిర్రర్, వుడ్ ఇతరత్రా ఆలోచనలు చేస్తారు. సన్నని ఇటుక గోడ పార్టిషన్‌తో భిన్నమైన కళ తీసుకురావచ్చు. ఇక ఈ ఇటుక గోడలకు వైట్ వాష్ లేదా బ్లాక్ వాష్ ఐడియాలతో కొత్త కళను తీసుకురావచ్చు. తరతరాల ముచ్చట పాత ఇంటి గోడలపై పెయింట్ చేసిన బొమ్మలు, ముగ్గులు, పిల్లల ఆటల్లో వారు గీసిన రేఖాచిత్రాలు .. ఇవన్నీ ఇప్పుడు ఇంటిలోపల గోడపై కనువిందు చేయడం విశేషమైపోయింది. ఆ మనోహర దృశ్యాలకు తమ ఇల్లు వేదికైందని మురిసిపోతున్నారు నవతరం కళాప్రియులు. -
నగరానికి అందం తెస్తున్న ‘ఆ నలుగురు’!
సాక్షి, బంజారాహిల్స్: రంగురంగుల శిల్పాలు.. ఆలోచనాత్మక పెయింటింగ్స్‌తో వీధులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బాటసారులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే శిల్పాలను ఏర్పాటు చేస్తూ నగరానికి మరింత వన్నె చేకూరుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే పలు ప్రాంతాల్లో జేఎన్టీయూకి చెందిన నలుగురు విద్యార్థులు ఈ కళాత్మక ఆకృతులను తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతాలకు కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నారు. జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన సంతోష్ బుద్ది, అబ్దుల్ రహ్మాన్, మహేష్‌కుమార్ గంగనపల్లి, మురళీకృష్ణ కంపెల్లిలు గత కొద్ది రోజులుగా పలు ప్రహరీలకు కొత్త నగషిలు చెక్కుతున్నారు. కేవలం రంగులు పూసి చేతులు దులుపుకోకుండా ఆ ఆకృతులకు ఆలోచనల రూపురేఖలు తీసుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ నలుగురు యువకులు ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రహరీలకు కొత్త రూపును సంతరించుకునేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తమకు సంపూర్ణ సహకారం అందిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ పెయింటింగ్స్, శిల్పాలు తమకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. ముందుగా తాము పెయింటింగ్ వేసే ప్రాంతాన్ని లేదా శిల్పాలు తీర్చిదిద్దే చౌరస్తాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటే బాగుంటుందో డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. విద్య, పచ్చదనం, పూలు ఇలా వివిధ రకాల ఆలోచనలతో ఈ ఆర్ట్ వర్క్స్ ఉంటాయని వారు తెలిపారు. ఆకట్టుకునే శిల్పాలివే.. ► ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.70 అశ్విని లేఅవుట్ చౌరస్తాలో రాష్ట్ర పక్షి పాలపిట్ట శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ►బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.1/5 జీవీకే వన్ చౌరస్తాలో గులకరాళ్ల శిల్పాన్ని తీర్చిదిద్దారు. ► బంజారాహిల్స్ రోడ్ నెంబర్.45 జంక్షన్లో వాల్ ఆర్ట్‌ను వేశారు. ►లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద కూడా ఈ వాల్ ఆర్ట్ కనువిందు చేస్తున్నాయి. ►బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1/12 పెన్షన్ కార్యాలయం చౌరస్తాలో బస్టాప్‌ను వాల్ ఆర్ట్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన చిన్నారులకు విద్య తప్పనిసరి అనే కాన్సెప్ట్‌తో వాల్ ఆర్ట్ ఆకట్టుకుంటున్నది. ► ఫిలింనగర్ సీవీఆర్ న్యూస్ చౌరస్తాలో వాల్ ఆర్ట్ పాదచారులు, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ►ఇలా ప్రధానమైన చౌరస్తాలో ఈ నలుగురు విద్యార్థులు తమలోని ప్రతిభతో నగరంలోని పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతూ చూపరులను కట్టిపడేస్తున్నారు. -
సొరంగం ఉందని వెళ్తే.. సొట్టలే!
తుంటరి ఆలోచనలకు అంతు లేదు. తమకున్న టాలెంటును రకరకాలుగా ఉపయోగించుకుంటారు. మొన్నీమధ్య హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లన్నింటి మీద రకరకాల వాల్ ఆర్టులు వేసి వాటిని అందంగా తీర్చిదిద్దిన విషయం గుర్తుంది కదూ. కానీ.. చెన్నైలో మాత్రం ఓ తుంటరి తనకున్న కళను వేరేవిధంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లై ఓవర్ గోడ మీదే అతడు తన పెయింటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కానీ ఆ నైపుణ్యమే కార్ల పాలిట శాపంలా మారింది. అచ్చం ఓ సొరంగం ఉన్నట్లుగా ఫ్లై ఓవర్ గోడమీద పెయింట్ చేయడంతో.. నిజంగా టన్నెల్ ఉందేమోనని, అవతలకి వెళ్లాల్సిన వాళ్లంతా చుట్టు తిరిగి వెళ్లక్కర్లేదనుకుని ఆ ఫ్లై ఓవర్ గోడను గుద్దేస్తున్నారు. సొరంగంలోంచి వెళ్తే సమయం ఆదా అవుతుందనుకున్న వాళ్లు.. తమ కార్లకు పట్టిన గతి చూసి, దాని రిపేర్లకు ఎంత మొత్తం వదులుతుందోనని తల పట్టుకుంటున్నారు. ఎవరో ఇడియట్ ఇలా గోడ మీద పెయింటు వేశాడు చూడండి అంటూ.. ఫ్లై ఓవర్ ఫొటోను, పాడైన కారు ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. మీరు కూడా అటువైపు వెళ్తే.. కాస్తంత జాగ్రత్తగా ఉండండి.