Haier Release S8 Series 4K Smart Led Android TV - Sakshi
Sakshi News home page

Haier: అదిరిపోయే టీవీ..ఐఓటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంకా..

Published Sat, Sep 4 2021 9:04 AM | Last Updated on Sat, Sep 4 2021 6:36 PM

Haier Release S8 Series 4k Smart Led Android Tv  - Sakshi

న్యూఢిల్లీ: గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం హయర్‌ తాజాగా ఎస్‌8 ఆండ్రాయిడ్‌ టీవీల శ్రేణిలో కొత్తగా మరో రెండు టీవీలను ఆవిష్కరించింది.

వీటిలో 55 అంగుళాల టీవీ రేటు రూ. 1,10,990గాను, 65 అంగుళాల టీవీ ధర రూ. 1,39,990గాను ఉంటుంది. 4కే హెచ్‌డీఆర్‌ పిక్చర్‌ నాణ్యత, ఆల్‌–స్క్రీన్‌ డిస్‌ప్లే, ఫ్రంట్‌ స్పీకర్‌ డిజైన్‌ తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయి. 

లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ 9.0 వెర్షన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైన ప్రత్యేకతలతో ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్‌ డివైజ్‌లకు ఐవోటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) హబ్‌గా కూడా ఉపయోగపడుతుందని హయర్‌ అప్లయెన్సెస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement