ఫ్రాంక్‌ఫర్ట్: క్లెయింట్ల నుంచి కొత్త ప్రాజెక్టులు తగ్గిపోవడం, మందగమనంతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలు నూతన టెక్నాలజీపై దృష్టిసారించాయి. డేటా ఎనలిటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రొబోటిక్స్‌పై ఆసక్తి కనబరుస్తున్న సంస్థలు వీటిని వీలైనంతగా ప్రమోట్ చేస్తూ మెరుగైన సేవలతో క్లయింట్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ ఐటీ దిగ్గజం సాఫ్ట్‌వేర్ ఏజీ నూతనంగా ఐఓటీ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. సంస్థ లాభాలు దారుణంగా పడిపోవడంతో కొత్త టెక్నాలజీలకు మొగ్గుచూపింది.
జనవరిలో ప్రత్యేక ఐఓటీ విభాగాన్ని నెలకొల్పుతామని సాఫ్ట్‌వేర్ ఏజీ స్పష్టం చేసింది. ఐఓటీ ఆధారిత రెవెన్యూలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని కంపెనీ సీఎఫ్‌ఓ జిన్‌హార్డ్ చెప్పారు. మరోవైపు సంస్థ డిజిటల్ బిజినెస్ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో నూతన టెక్నాలజీలపై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకూ కసరత్తు చేస్తోంది. పలు కంపెనీలు ఇక ఐఓటీ వంటి నూతన టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తుండటంతో ఈ విభాగంలో టెకీలకు మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment