new technologies
-
సేవలపై ఫిర్యాదుకు వేచి చూడాల్సిందే
న్యూఢిల్లీ: ఏఐ ఏజెంట్లు, చాట్బాట్లు ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా.. కస్టమర్ సేవల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభించడం లేదు. ఫిర్యాదు నమోదు చేయడానికే గంటలు, రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. 2024లో దేశీయ వినియోగదారులు సేవలపై ఫిర్యాదు నమోదు చేయడానికి వేచి చూసిన సమయం 1500 కోట్ల గంటలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలను సర్విస్ నౌ ‘కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్’ నివేదిక వెల్లడించింది. కస్టమర్ల అంచనాలు, లభిస్తున్న సేవల మధ్య ఉన్న ఎంతో అంతరం ఉన్నట్టు ఈ నివేదిక గుర్తించింది. 5,000 మంది కస్టమర్లు, 204 మంది కస్టమర్ సేవల ఏజెంట్లను ప్రశ్నించి, వచ్చిన వివరాల ఆధారంగా ఫలితాలను విశ్లేషించింది. ఓపిక పట్టాల్సిందే.. 80 శాతం భారత వినియోగదారులు కనీస అవసరాలైన ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం, ఉత్పత్తుల సిఫారసుల కోసం ఏఐ చాట్బాట్లపై ఆధారపడుతున్నారు. కస్టమర్లు అంతా కలసి ఇందుకోసం ఏటా 1500 కోట్ల గంటల సమయం వెచ్చిస్తున్నారు. 2023తో పోల్చితే 2024లో ఒక ఫిర్యాదు పరిష్కారానికి వేచి చూడాల్సిన సమయం 3.2 గంటలు తగ్గింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు, లభిస్తున్న సేవలకు మధ్య ఎంతో అంతరం ఉంది. 39 శాతం కస్టమర్ల ఫిర్యాదులను హోల్డ్‌లో పెట్టడం, 36 శాతం ఫిర్యాదులను బదిలీ చేయడం కనిపించింది. ఫిర్యాదుల ప్రక్రియ ఎంతో కష్టంగా ఉందని 34 శాతం మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. నాసిరకం సేవల కారణంగా బ్రాండ్లను మార్చడానికి 89 శాతం వినియోగదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. బలహీనమైన సేవలపై ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేస్తామని చెప్పారు. కస్టమర్ల సేవల్లో నెలకొన్న అంతరాన్ని తొలగించడానికి, వేగంగా పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి వీలుగా వ్యాపార సంస్థలు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఏఐ ఆధారిత సామర్థ్యాలను పెంచుకోకుంటే కంపెనీలు కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని సర్విస్‌నౌ ఇండియా ఎండీ సుమీత్ మాధుర్ అన్నారు. -
ఈ ఏడాది ఐటీఈఎస్ కొలువుల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీ ఐటీఈఎస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్విసెస్) రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. ఉద్యోగావకాశాలు 20 శాతం మేర పెరగనున్నాయి. ఏఐ ఆధారిత నియామకాల సేవల ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాహైర్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 42,000 మంది ఉద్యోగార్థుల ప్రొఫైల్స్, 11,000 పైచిలుకు రిక్రూటర్–క్యాండిడేట్ల ఇంటర్వ్యూ వివరాల అధ్యయనం ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. తమ ‘ఇన్‌స్టాహైర్ టెక్ శాలరీ ఇండెక్స్ 2025‘ ప్రకారం అనుభవం, డొమైన్లవ్యాప్తంగా జీతభత్యాల డైనమిక్స్ కూడా మారుతున్నట్లు తెలిపింది.కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉద్యోగావకాశాలు 75 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక తాత్కాలిక ఉద్యోగుల గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ విధానాలు కూడా పరిశ్రమ రూపురేఖలను తీర్చిదిద్దడంలో కీలకంగా ఉంటున్నాయని ఇన్‌స్టాహైర్ నివేదిక తెలిపింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్ మార్కెట్లో పోటీపడేందుకు దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందడమో లేదా ప్రస్తుతమున్న వాటిని మరింతగా మెరుగుపర్చుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ⇒ వివిధ స్థాయుల్లో అనుభవమున్న డెవ్ఆప్స్ నిపుణులకు, ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలున్న వారికి 10 శాతం మేర వేతన వృద్ధి ఉంటోంది. 0–5 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ల వేతనం వార్షికంగా సుమారు రూ. 1.5 లక్షలు తగ్గగా, ఆరేళ్ల పైగా అనుభవమున్న ఫ్రంట్ ఎండ్ నిపుణుల శాలరీలు వార్షికంగా సుమారు రూ. 4 లక్షల మేర పెరిగాయి. మొబైల్ డెవలప్మెంట్, డేటా సైన్స్ విభాగాల్లోనూ ఇదే ధోరణి నెలకొంది. ⇒ బ్యాక్ఎండ్ నైపుణ్యాలకు సంబంధించి పైథాన్ నిపుణులకు అత్యధికంగా వేతనాలు ఉంటున్నాయి. ప్రతి అయిదేళ్ల అనుభవానికి వేతనం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. జావాకి కూడా మంచి డిమాండ్ నెలకొంది. ఫ్రెషర్స్ నుంచి పదేళ్ల పైగా అనుభవమున్న వరకు వివిధ స్థాయుల్లోని ఉద్యోగుల వేతనాలు అయిదు రెట్లు పెరిగాయి. ⇒ ప్రతిభావంతులకు హాట్‌స్పాట్‌గా బెంగళూరు కొనసాగుతోంది. దేశీయంగా 35 శాతం మంది టెక్నాలజీ సిబ్బందికి కేంద్రంగా ఉంటోంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ (చెరి 20 శాతం చొప్పున), పుణె (15 శాతం), చెన్నై (10 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ⇒ చండీగఢ్, జైపూర్, ఇండోర్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు ఆకర్షణీయమైన టెక్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. ⇒ నిపుణులు, నాన్–మెట్రో ప్రాంతాలకు రీలొకేట్ అయ్యేందుకు రిమోట్ పని విధానంపరమైన వెసులుబాటు ఉపయోగకరంగా ఉంటోంది. ⇒ సైబర్‌సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ల సారథ్యంలో నియామకాలు జోరందుకోనున్నా యి. ఏఐ అనుభవానికి కంపెనీలు ప్రా ధాన్యం ఇస్తున్నందున వైవిధ్యం కన్నా నైపుణ్యాలను బట్టి నియమించుకునే ధోరణి పెరుగుతోంది. ⇒ కంపెనీలు వినూత్న హైరింగ్ వ్యూహాలను అమలు చేస్తుండటంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టే నిపుణులకు కెరియర్ వృద్ధి మెరుగ్గా ఉంటుంది. -
టెక్ హైరింగ్‌లో బ్యాం‘కింగ్’!
ఆన్లైన్ మోసగాళ్లు.. డేటా హ్యాకర్ల రిస్కును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని ఒకపక్క ఆర్బీఐ పదేపదే హెచ్చరికలు. మరోపక్క తీవ్ర పోటీ నేపథ్యంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. దీంతో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయాలతో పాటు టెక్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసులు– ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో కూడా మరిన్ని ఐటీ కొలువులు సృష్టించనుంది. దేశ ఐటీ రంగంలో హైరింగ్ ఇంకా మందకొడిగానే ఉన్నప్పటికీ... దీనికి భిన్నంగా బ్యాంకులు మాత్రం రారమ్మంటూ టెకీలకు స్వాగతం పలుకుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్నాలజీ నిపుణులకు ఫుల్ డిమాండ్ నడుస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ సంస్థలు తమ ఐటీ వ్యయాలను 12% పెంచుకోనున్నట్లు అంచనా. ఎనలిటిక్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత సొల్యూషన్లతో పాటు ఆటోమేషన్ టెక్నాలజీలపై ఆయా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే హైరింగ్ కూడా జోరందుకుందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకమైన విభాగాల్లో హైరింగ్ డిమాండ్ ఉంది. క్లౌడ్‌కు మారుతున్న సంస్థలు అత్యవసరంగా టెక్నాలజీ నిపుణులు కావాలని కోరుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో కూడా భారీగానే నియామకాలు కొనసాగనున్నాయి’ అని క్వెస్ ఐటీ స్టాఫింగ్ డిప్యూటీ సీఈఓ కపిల్ జోషి పేర్కొన్నారు. ఈ ఏడాది బీఎఫ్ఎస్ఐ రంగం టెక్ హైరింగ్ 6–8% వృద్ధి చెందనుందని, ఫ్రెషర్లతో పాటు టెక్నాలజీపై పట్టున్న ప్రొఫెషనల్స్‌కు కూడా అవకాశాలు లభిస్తాయని టీమ్‌లీజ్ తెలిపింది. తయారీ తర్వాత అత్యధిక జాబ్స్... టెక్నాలజీయేతర కంపెనీల్లో అత్యధికంగా టెక్ ఉద్యోగులను నియమించుకుంటున్న రంగంగా త్వరలో బీఎఫ్ఎస్ఐ అగ్రస్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం టాప్‌లో తయారీ రంగం ఉంది. 2023 నాటికి బీఎఫ్ఎస్ఐ సంస్థల మొత్తం టెక్ సిబ్బంది సంఖ్య 4 లక్షల స్థాయిలో ఉండగా.. 2026 కల్లా 4.9 లక్షలకు ఎగబాకుతుందనేది టీమ్‌లీజ్ అంచనా. అంటే 22.5 శాతం వృద్ధి చెందనుంది. మరోపక్క, బీఎఫ్ఎస్ఐలో మొత్తం సిబ్బంది సంఖ్య ఇప్పుడున్న 71 లక్షల నుంచి 2026 నాటికి 12 శాతం వృద్ధితో 80 లక్షలకు చేరుకుంటుందని లెక్కగట్టింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో బీఎఫ్ఎస్ఐ రంగంలో జరిగిన మొత్తం నియామకాల్లో 8% పైగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి చెందినవే. 15% ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 11% సైబర్ సెక్యూరిటీలో నమోదయ్యాయి. ఇక డేటా సైన్స్– ఎనలిటిక్స్ జాబ్స్‌లో హైరింగ్ 7% వృద్ధి చెందగా, ఏఐ/ఎంఎల్ ఇంజనీర్లకు 10% అధికంగా జాబ్స్ లభించాయి. ఈ రెండు విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ కంటే ఎక్కువగా ఉద్యోగాలిచి్చన రంగాల్లో సాఫ్ట్వేర్ సేవలు, ఇంటర్నెట్–ఈకామర్స్, అడ్వర్టయిజింగ్–పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి.టెక్నాలజీకి పెద్దపీట... నెట్ బ్యాంకింగ్‌కు తోడు యాప్స్, యూపీఏ పేమెంట్స్ ఇలా బ్యాంకింగ్ లావాదేవీలకు ఇప్పుడు ఆన్లైన్ కీలకంగా మారింది. దీంతో బ్యాంకులు సిబ్బంది నియామకాల్లో టెకీలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ఆరి్థక సంవత్సరంలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్లు (పీఓ)గా సుమారు 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే సన్నాహాల్లో ఉంది. ఇందులో 85 శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశాలు లభించనున్నాయని అంచనా. గడిచిన మూడేళ్లలో యస్ బ్యాంక్ ఏటా 200 మంది టెక్ నిపుణులను నియమించుకోవడం గమనార్హం. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలదించేందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్–ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ సంస్థలన్నీ జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ రంగంలో ప్రతిభ గల ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పుంజుకోవడానికి ఇదే ప్రధాన కారణం. – కపిల్ జోషి, డిప్యూటీ సీఈఓ, క్వెస్ ఐటీ స్టాఫింగ్– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టెక్.. టాక్: లేటెస్ట్ అప్డేట్స్, గాడ్జెట్స్
గూగుల్ అసిస్టెంట్‌లో.. గూగుల్ తన ఏఐ-పవర్డ్ అసిస్టెంట్ అప్డేటింగ్లో భాగంగా కొన్ని అండర్ యుటిలైజ్డ్ ఫీచర్లను తొలిగించనుంది. వాటిలో కొన్ని: ప్లేయింగ్ అండ్ కంట్రోలింగ్ ఆడియో బుక్స్, సెట్టింగ్ మీడియా అలారమ్స్, మ్యానేజింగ్ కుక్‌బుక్స్, యూజింగ్ వాయిస్ కాల్స్ అండ్ ఇ–మెయిల్, రీషెడ్యూలింగ్ ఈవెంట్స్, వాయిస్ కంట్రోల్ ఫర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ యువర్ స్లీప్ సమ్మరిస్, రిక్వెస్టింగ్ స్పెసిఫిక్ యాక్షన్స్ వయా వాయిస్-మేకింగ్ పేమెంట్స్, రిజర్వేషన్స్, సోషల్ మీడియా పోస్ట్స్, రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎబౌట్ యువర్ కాంటాక్ట్స్, కమ్యూట్ టు వర్క్ టైమ్ ఎస్టిమేట్స్. వన్‌ప్లస్ 12 ఆర్.. డిస్ప్లే : 6.78 అంగుళాలు ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ బ్యాటరీ : 5500 ఎంఏహెచ్ వోఎస్ : ఆండ్రాయిడ్ 14 ర్యామ్ : 12జీబి ; స్టోరేజŒ æ: 256 జీబి వోఎస్ : ఆండ్రాయిడ్ 14 రిఫ్రెష్ రేట్ : 120 హెచ్జడ్ మొబైల్ టేబుల్‌టాప్ స్టాండ్.. ♦ బ్రాండ్: స్వాప్కార్ట్ ∙కలర్: వైట్ ♦ ఫామ్ ఫ్యాక్టర్: టేబుల్ స్టాండ్ ♦ మల్టీ ఫంక్షన్ క్లిప్ ♦ మల్టీపర్పస్ మొబైల్ యాక్సెసరీ ఎవర్గ్రీన్ ఎనర్జీ.. ‘వెల్కమ్ టు హమ్బోల్డీ బొటానికల్ గార్డెన్’ అంటూ ఆహ్వానిస్తోంది ది కబ్. అడ్వెంచర్ గేమ్ ‘ది కబ్’ నేడు విడుదల అవుతుంది. ‘ది జంగిల్ బుక్’ ‘లయన్ కింగ్’లాంటి ఎన్నో క్లాసిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని నేటి కాలానికి తగినట్లుగా రూపొందించిన గేమ్ ఇది. ఈమధ్య విడుదలైన గేమ్ ట్రైలర్ ప్లేయర్స్‌కు ఉత్సాహం కలిగించేలా ఉంది. పబ్లిషర్స్: అన్‌టోల్డ్ టేల్స్, గేమర్స్కైగేమ్స్, ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ వన్, ప్లేస్టేషన్4, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్. జానర్స్: ప్లాట్‌ఫామ్ గేమ్, అడ్వెంచర్ గేమ్. ఎట్ సీ.. అయోమయంలో ఉండి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో వాడే మాట... ఎట్ సీ. ఉదా: ఐయామ్ కంప్లీట్లీ ఎట్ సీ విత్ ది న్యూ కంప్యూటర్ సిస్టం. నెససరీ ఇవిల్.. ఒక విషయం నచ్చకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడం. ఉదా: మోస్ట్ అమెరికన్స్ యాక్సెప్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ నెససరీ ఇవిల్. మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ బటన్.. మైక్రోసాఫ్ట్ తన విండోస్ కీబోర్డులకు కొత్త ఏఐ బటన్‌ను యాడ్ చేస్తుంది. రిబ్బన్–షేప్డ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఏఐ–పవర్డ్ చాట్‌బాట్ కోపైలట్ ఆన్లైన్లో ఫర్నీచర్ సెర్చింగ్, డ్రాఫ్ట్ టెక్ట్స్, ఇమేజ్‌లను క్రియేట్ చేయడం, ఐడియాలను సాంగ్స్‌గా మలచడానికి యూజర్లకు ఉపయోగపడుతుంది. కొత్త బటన్ స్పేస్బార్కు కుడి వైపున ఉంటుంది. రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్.. రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్ మన దేశంలో లాంచ్ అయింది. ఈ ఇ–ఇంక్ ట్యాబ్ రోజువారీ నోటుబుక్లాగే పనిచేస్తుంది. నోటుబుక్ రాసిన అనుభూతిని ఇస్తుంది. నోట్స్ తీసుకోవడానికి, డాక్యుమెంట్లను రివ్యూ చేయడానికి... రకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని వివరాలు.. 10.3 అంగుళాల మోనో క్రోమ్ డిజిటల్ పేపర్ డిస్ప్లే రిజల్యూషన్: 1,872్ఠ1,404 పిక్సెల్స్ 1.2 జీహెచ్ డ్యూయల్–కోర్ ఏఆర్ఏం చిప్సెట్ వై–ఫై బ్యాటరీ: 3.000 ఎంఏహెచ్ ఇవి చదవండి: మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని' -
కృత్రిమ మేధపై మథనం
సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయగా, బ్రిటన్‌లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్‌జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్‌జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది. ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నిక్ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు. ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్చల్ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్ యూనియన్లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: అఫిడవిట్లతో జాగ్రత్త -
కొత్త సాంకేతిక సాధనాలను అందిపుచ్చుకోండి
ముంబై: ఆర్థిక రంగానికి సంబంధించిన టెక్నాలజీలు శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో కొత్త సాంకేతిక సాధనాల గురించి బ్యాంకింగ్ పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ సూచించారు. తద్వారా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగేలా పర్యవేక్షణ మెళకువలను మెరుగుపర్చుకోవాలని, రిస్క్ నిర్వహణ సామరŠాధ్యలను పటిష్టం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆసియా–పసిఫిక్ దేశాల 25వ సీసెన్–ఎఫ్ఎస్ఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైన్ ఈ విషయాలు తెలిపారు. ఇటీవల కొన్ని విదేశీ బ్యాంకులు విఫలమైన ఉదంతాలు బైటపడిన నేపథ్యంలో బ్యాంకింగ్ సూపర్వైజర్ల పని మరింత కఠినతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కొత్త సవాళ్లు ఎదురవుతుండటంతో వారు ఇటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, అటు నైతికంగా వ్యవహరించడం మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని జైన్ చెప్పారు. వివేకవంతమైన నిబంధనలను అమలు చేయడం, సమర్ధమంతమైన రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానం పాటించడం, పారదర్శకతను ప్రోత్సహించడం, సకాలంలో జోక్యం చేసుకోవడం, స్వతంత్రత.. జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా దీన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీజతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పలు రిస్కులు కూడా పొంచి ఉంటాయని జైన్ వివరించారు. కాబట్టి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. -
డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు
న్యూఢిల్లీ: డిజిటైజేషన్, కొంగొత్త టెక్నాలజీలు.. బ్యాంకింగ్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఖర్చులు తగ్గించి, సర్వీసులను విస్తృతంగా అందించేందుకు తోడ్పడుతున్న డిజిటల్ విప్లవానికి దేశీ బ్యాంకులు అలవాటు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సర్వీసులు అందించడంపై బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటోందని ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీల వినియోగంపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను డిజిటల్ ఆవిష్కరణలు మార్చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటైజేషన్, డిజిటల్ ఆవిష్కరణలనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు వ్యూహాత్మక ప్రాధాన్యత అంశాలుగా మారాయి‘ అని ఖారా వివరించారు. మారే పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విధానాలకు వేగంగా మళ్లాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి డిజిటల్ రుణాల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఖారా పేర్కొన్నారు. రుణాల ప్రక్రియ కూడా డిజిటల్‌గా మారాలి.. ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థ డిజిటల్‌గా మారిందని, ఇక రుణాల విభాగం కూడా డిజిటల్‌గా మారాల్సిన సమయం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా చెప్పారు. బ్యాంకులు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని రుణ ఉత్పత్తుల డిజిటైజేషన్‌ను మొదలుపెట్టాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ పరిశ్రమలో టెక్నాలజీ, ఆవిష్కరణల వినియోగం క్రమంగా పెరుగుతోందని, కరోనా వైరస్ మహమ్మారి రాకతో ఇది మరింత వేగం పుంజుకుందని మెహతా తెలిపారు. మరోవైపు, భారత్ చాలా వేగంగా డిజిటల్ ఆధారిత ఎకానమీగా రూపాంతరం చెందుతోందని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) కంట్రీ హెడ్ (ఇండియా) వెండీ వెర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫిన్‌టెక్ వినియోగం భారత్‌లోనే ఉందని, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ఫిన్‌టెక్ మార్కెట్ 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని.. ఇది మరింతగా వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
బెల్ట్‌తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..!
శాస్త్ర సాంకేతికత రోజూరోజూ సరికొత్త పుంతలను తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడంలో ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ఎప్పుడూ ముందు ఉంటుంది. సౌండ్‌నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే సాంకేతికతను, స్మార్ట్ఫోన్స్తో భూకంపాలను గుర్తించే టెక్నాలజీలను షావోమీ అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కాంటాక్ట్ లేస్ పేమెంట్స్‌లో భాగంగా సరికొత్త ఒరవడిని తెచ్చేందుకు షావోమీ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! స్మార్ట్‌వాచ్ బెల్ట్(స్ట్రాప్)నుపయోగించి లావాదేవీలను చేసే టెక్నాలజీని షావోమీ త్వరలోనే ఆవిష్కరించనుంది. షావోమీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి స్మార్ట్‌వాచ్ స్ట్రాప్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ సాంకేతికతను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో నమోదు చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు.స్మార్ట్వాచ్స్కు అమర్చే ఈ కొత్త స్ట్రాప్‌లు నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ)తో పనిచేయనున్నాయి. ఎన్ఎఫ్సీ లావాదేవీల్లో భాగంగా షావోమీ తన భాగస్వాములుగా రూపే, ఆర్బీఎల్, జెటాతో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ స్ట్రాప్‌ను త్వరలోనే టీజ్ చేస్తున్నట్లు రఘు ట్విటర్ పేర్కొన్నారు. Today we announced our entry into the FUTURE OF CONTACTLESS PAYMENTS at the Global Fintech Festival. Thrilled to announce that we will be launching the Xiaomi NFC Mi Pay straps soon. Working with @RuPay_npci, RBL & Zeta to make this happen. Stay tuned. pic.twitter.com/5yD2eywhPO — Raghu Reddy (@RaghuReddy505) September 28, 2021 చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
కొత్త ప్రపంచం 15th Dec 2019
-
కొత్త ప్రపంచం 10th Nov 2019
-
కొత్త ప్రపంచం 3rd Nov 2019
-
కొత్త ప్రపంచం 13th Oct 2019
-
కొత్త ప్రపంచం 3rd Feb 2019
-
కొత్తప్రపంచం 20th jan 2019
-
క్రేజీ కోర్సు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీలు సాంకేతిక విద్యలో దూసుకువస్తున్న నేపథ్యంలో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేథ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ)లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ హైదరాబాద్ ప్రారంభించనుంది. ఏఐలో పూర్తిస్ధాయి బీటెక్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తున్న తొలి భారత విద్యా సంస్థ ఐఐటీ- హైదరాబాద్ కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన కర్నెగీ మెలన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) తర్వాత ఈ తరహా కోర్సును అందిస్తున్న మూడవ విద్యా సంస్థగా కూడా ఐఐటీ హైదరాబాద్ నిలవనుంది. ఇక బీటెక్ ఏఐలో 20 మంది విద్యార్ధులను తీసుకుంటారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో మూల సిద్ధాంతం, ప్రాథమిక అంశాలు, ప్రాక్టికల్స్‌పై అత్యున్నత శిక్షణ అందిస్తారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా విద్యార్ధులను దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో రాటుదేలేలా తీర్చిదిద్దుతారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏఐ శిక్షణ, పరిశోధనకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడమే ముఖ్యోద్దేశంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని, ఏఐలో బీటెక్, ఎంటెక్ సహా పలు ప్రోగ్రామ్‌లను అందుబాటులో ఉంటాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ యూబీ దేశాయ్ వెల్లడించారు. విద్యాపరమైన అంశాలతో పాటు పరిశోధన, అభివృద్ధికీ మెరుగైన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. -
కొత్త ప్రపంచం 30th Dec 2018
-
కొత్త ప్రపంచం 23rd Dec 2018
-
టెకీలకు భారీ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : టెకీలకు ఐటీ పరిశ్రమ తీపికబురు అందించింది. రానున్న రెండు క్వార్టర్లలో భారీ స్ధాయిలో ఉద్యోగులను నియమించుకోవాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు గత ఏడాదితో పోలిస్తే రానున్న ఆరు నెలల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని ఐటీ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా చేపట్టిన సర్వేలో 500 ఐటీ కంపెనీలు వెల్లడించాయి. నూతన టెక్నాలజీల నేపథ్యంలో నవ్యతకు పెద్దపీట వేసేందుకు ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ముమ్మరంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, దీంతో టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సర్వే నిర్వహించిన ఎక్స్పెరిస్ ఐటీ, మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ చెప్పారు. ఐటీలో ఉపాధి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని, సరైన నైపుణ్యాలున్న వారికి మెరుగైన వేతనం చెల్లించేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయన్నారు. బిగ్ డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐ డెవలపర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. 0-5 ఏళ్ల అనుభవంతో నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలనుకునే యువతకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. నూతన టెక్నాలజీల్లో కెరీర్‌ను ఎంచుకోవాలనుంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఐటీ పరిశ్రమలో మార్పులను అవగతం చేసుకుని అందుకు అనుగుణంగా నైపుణ్యాలను సంతరించుకోవాలని సూచించారు. -
జీవితం.. టెక్‌మయం
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటున్న టెక్నాలజీ.. మానవ జీవితాన్ని ఓ వైపు అత్యంత శోభాయమానంగా, సుఖవంతంగా తీర్చిదిద్దుతూనే మరో వైపు దుర్భర సమస్యల సుడిగుండలోకి నెడుతోంది. దీన్ని సమన్వయం చేసుకుని నైతికత పాటిస్తే.. వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : రోజురోజుకూ వాయువేగంతో అభివృద్ధి చెందున్న టెక్నాలజీ వాడకంలో విచక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సమస్యలను మరింత సౌకర్యవంతంగా వేగంగా పరిష్కరించుకునే వీలుంటుందని చెబుతున్నారు. విద్యావిధానంలోనూ ఆధునిక టెక్నాలజీ.. టెక్నాలజీ విద్యావిధానంలోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు నల్లబోర్డుపై తెల్లటి రాతలు. బట్టీ పట్టే విద్య. నేడు తెల్ల బోర్డుపై డిజిటల్ విద్య. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో డిజిటల్ తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బట్టీకి స్వస్తి పలుకుతూ ప్రాక్టికల్‌గా విద్యనభ్యసించేలా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వాలు సైతం విద్యావిధానంలో విప్లవాత్మక సాంకేతిక మార్పులు తీసుకొస్తూ నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతోంది. సెల్ఫోన్లు వినియోగంతో.. డెస్క్‌టాప్(కంప్యూటర్), ల్యాప్‌టాప్‌లానే మనం నిత్యం ఇతరులతో సంభాషించడానికి వినియోగించే సెల్ఫోన్లూ(స్మార్ట్‌ఫోన్) విజ్ఞాన కేంద్రాలయ్యాయి. సెల్ఫోన్లు వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచాన్ని బంధించి అంతులేని విజ్ఞానాన్ని అందిస్తోంది. ప్రస్తుత ప్రాక్టికల్ విద్యావిధానంలో ఇదొక మంచి సాధనం. విద్యాపరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త యాప్‌లు వస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, పాఠ్యాంశాల్లోని అంశాలను తరవుగా నేర్చుకుని మేథస్సును పదును పెట్టడానికి దోహదపడుతున్నాయి. అయితే సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే సమయాన్ని తినేసే కిల్లర్‌గా సెల్‌ఫోన్ మారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సృష్టించడమే కాకుండా విద్యాపరమైన అభివృద్ధి సాధించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. విపరీత పరిణామాలు అతిగా సాంకేతికతపై ఆధారపడడం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానిసిక రుగ్మతలు, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. సాంకేతికతకు బానిస అవ్వడం, అనారోగ్యకరమైన, అసాంఘిక సైట్లను వీక్షించే దురలవాట్లకు లోనై సమయాన్ని వృథా చేసుకోవడం జరుగుతుంది. తగిన విచక్షణ, విజ్ఞతతో వ్యవహరించి, అవసరం మేరకు కావాల్సిన విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం వరకే సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రస్తుతం పిల్లలు సెల్ఫోన్లు, కంప్యూటర్లతో అధిక సమయం వెచ్చిస్తున్నారు. చెడుదోవ పట్టకుండా సక్రమ మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండడం ఉత్తమం. – ఓంప్రకాష్ కోటపాటి, స్టేట్ రిసోర్స్ పర్సన్, విద్యారంగ విశ్లేషకులు తల్లిదండ్రులు గుర్తించాలి.. తమ పిల్లాడు కంప్యూటర్లో గేమ్‌లు, సెల్‌ఫోన్‌ను పొద్దస్తమానం ఆపరేట్ చేస్తుంటాడని ఆవేదనతో చెబుతున్న తల్లిదండ్రులు కొందరైతే.. ‘మా పిల్లాడు చాలా గ్రేటండి... కంప్యూటర్, సెల్ఫోన్లో తెలియని అంశాలే లేవు’ అని గర్వంగా చెప్పే తల్లిదండ్రులు మరి కొందరు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తదనం పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు కొత్తదనం శోధించాలనే తపనతో నిరంతరం కుస్తీ పడుతుంటారు. అవధులు దాటనంత వరకు ఇది మంచి విషయమే. విచ్చలవిడి అయితేనే ప్రమాదం. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతున్నారు. -
మనం ఎవరి ఉద్యోగాలనూ లాగేసుకోవడం లేదు
సాక్షి, ముంబయి : భారత ఐటీ పరిశ్రమ ఏ ఒక్కరి ఉద్యోగాలను లాగేసుకోవడం లేదని నాస్కామ్కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ దేవజని ఘోష్ అన్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత ఐటీ పరిశ్రమపై ఉన్న అపోహలను తొలగించడమే తన ముందున్నకర్తవ్యమని చెప్పారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలకు కంపెనీలను సిద్ధం చేసేలా నైపుణ్య కార్యక్రమాలకు పరిశ్రమ పెద్దలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దేశీయ మార్కెట్లో సేవలందిచేందుకు పలు కంపెనీలకు ఎదురవుతున్న అవరోధాలను తాము తొలగిస్తామన్నారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందకు తొలుత దేశంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడమే సరైన మార్గమని చెప్పారు. విద్యార్థులు వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా విద్యావ్యవస్థలోనే బీజం పడేలా మార్పులు అవసరమన్నారు. దేశంలో నూతన ఉద్యోగాల రూపకల్పనపై నాస్కామ్ దృష్టిసారిస్తుందన్నారు. గతంలోనూ నూతన టెక్నాలజీల కారణంగా కొందరు ఉద్యోగాలు కోల్పోయినా, అదే సమయంలో కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. కృత్రిమ మేథ, రోబోటిక్స్,డేటా అనలిటిక్స్ వంటి నూతన టెక్న్నాలజీల ద్వారా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
టెకీల టార్గెట్ ఇదే
ఫ్రాంక్ఫర్ట్: క్లెయింట్ల నుంచి కొత్త ప్రాజెక్టులు తగ్గిపోవడం, మందగమనంతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలు నూతన టెక్నాలజీపై దృష్టిసారించాయి. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రొబోటిక్స్‌పై ఆసక్తి కనబరుస్తున్న సంస్థలు వీటిని వీలైనంతగా ప్రమోట్ చేస్తూ మెరుగైన సేవలతో క్లయింట్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ ఐటీ దిగ్గజం సాఫ్ట్వేర్ ఏజీ నూతనంగా ఐఓటీ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. సంస్థ లాభాలు దారుణంగా పడిపోవడంతో కొత్త టెక్నాలజీలకు మొగ్గుచూపింది. జనవరిలో ప్రత్యేక ఐఓటీ విభాగాన్ని నెలకొల్పుతామని సాఫ్ట్వేర్ ఏజీ స్పష్టం చేసింది. ఐఓటీ ఆధారిత రెవెన్యూలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని కంపెనీ సీఎఫ్ఓ జిన్హార్డ్ చెప్పారు. మరోవైపు సంస్థ డిజిటల్ బిజినెస్ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో నూతన టెక్నాలజీలపై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకూ కసరత్తు చేస్తోంది. పలు కంపెనీలు ఇక ఐఓటీ వంటి నూతన టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తుండటంతో ఈ విభాగంలో టెకీలకు మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. -
ఛూ మంత్ర గాలి!
తెలుగు రాష్ట్రాలను ఇప్పుడైతే వర్షాలు ముంచెత్తుతున్నాయిగానీ.. అప్పుడప్పుడూ మనమూ నీటిచుక్క కోసం అంగలార్చేవాళ్లమే. ఒకవేళ నీటి కొరత లేదనుకున్నా... దొరికే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందన్నది డౌటే. మన దేశంలోనే కాదు.. ఆఫ్రికా మొదలుకొని చాలాచోట్ల ఇదే పరిస్థితి. అందుకే నీటి కాలుష్యాన్ని తొలగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తోందే.. ఈ గాడ్జెట్ ఒక అడుగు ముందుకేసి... గాల్లోంచి నీటిని సృష్టిస్తుంది. అన్ని రకాలుగా శుద్ధి చేసి అందిస్తుంది కూడా. ఇందులో ఆశ్చర్యపోయేందుకు ఏమీ లేదు. మన చుట్టూ ఉన్న గాల్లో ఎంతో కొంత తేమ ఉంటుందని మనకు తెలుసుకదా... ఆ తేమను ప్రత్యేకమైన టెక్నాలజీ, ఏర్పాట్ల ద్వారా ఒడిసిపడుతుందీ పరికరం. ఇజ్రాయెల్‌కు చెందిన వాటర్ జెన్ అనే కంపెనీ ఈ పరికరాన్ని తయారు చేసింది. కొంచెం కరెంటుతో చుట్టూ ఉన్న గాలిని పీల్చుకోవడం... అందులో ఉన్న తేమను వేరు చేసి, శుద్ధి చేసి అందించడం.. ఇదీ ఈ గాడ్జెట్ చేసే పని. వాటర్ జెన్ ప్రస్తుతం మూడు సైజుల్లో ఈ నీటి జనరేటర్లను తయారు చేస్తోంది. ఫొటోలో కనిపిస్తున్న జనరేటర్ తగిన ఉష్ణోగ్రత, తేమశాతం ఉన్నప్పుడు రోజుకు దాదాపు 3120 లీటర్ల నీటిని అందిస్తుంది. దీనికంటే కొంచెం చిన్నసైజుల్లో మరో రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. -
అత్యాధునిక టెక్నాలజీతో సోలార్ విద్యుదుత్పత్తి!