గూగుల్ అసిస్టెంట్‌లో..
గూగుల్ తన ఏఐ-పవర్డ్ అసిస్టెంట్ అప్‌డేటింగ్‌లో భాగంగా కొన్ని అండర్ యుటిలైజ్‌డ్ ఫీచర్‌లను తొలిగించనుంది. వాటిలో కొన్ని: ప్లేయింగ్ అండ్ కంట్రోలింగ్ ఆడియో బుక్స్, సెట్టింగ్ మీడియా అలారమ్స్, మ్యానేజింగ్ కుక్‌బుక్స్, యూజింగ్ వాయిస్ కాల్స్ అండ్ ఇ–మెయిల్, రీషెడ్యూలింగ్ ఈవెంట్స్, వాయిస్ కంట్రోల్ ఫర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ యువర్ స్లీప్ సమ్మరిస్, రిక్వెస్టింగ్ స్పెసిఫిక్ యాక్షన్స్ వయా వాయిస్-మేకింగ్ పేమెంట్స్, రిజర్వేషన్స్, సోషల్ మీడియా పోస్ట్స్, రిక్వెస్టింగ్ ఇన్‌ఫర్‌మేషన్ ఎబౌట్ యువర్ కాంటాక్ట్స్, కమ్యూట్ టు వర్క్ టైమ్ ఎస్టిమేట్స్.
వన్‌ప్లస్ 12 ఆర్..
డిస్‌ప్లే : 6.78 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
బ్యాటరీ : 5500 ఎంఏహెచ్
వోఎస్ : ఆండ్రాయిడ్ 14
ర్యామ్ : 12జీబి ; స్టోరేజŒ æ: 256 జీబి
వోఎస్ : ఆండ్రాయిడ్ 14
రిఫ్రెష్ రేట్ : 120 హెచ్‌జడ్
మొబైల్ టేబుల్‌టాప్ స్టాండ్..
♦ బ్రాండ్: స్వాప్‌కార్ట్ ∙కలర్: వైట్
♦ ఫామ్ ఫ్యాక్టర్: టేబుల్ స్టాండ్
♦ మల్టీ ఫంక్షన్ క్లిప్
♦ మల్టీపర్పస్ మొబైల్ యాక్సెసరీ
ఎవర్‌గ్రీన్ ఎనర్జీ..
‘వెల్‌కమ్ టు హమ్‌బోల్డీ బొటానికల్ గార్డెన్’ అంటూ ఆహ్వానిస్తోంది ది కబ్. అడ్వెంచర్ గేమ్ ‘ది కబ్’ నేడు విడుదల అవుతుంది. ‘ది జంగిల్ బుక్’ ‘లయన్ కింగ్’లాంటి ఎన్నో క్లాసిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని నేటి కాలానికి తగినట్లుగా రూపొందించిన గేమ్ ఇది. ఈమధ్య విడుదలైన గేమ్ ట్రైలర్ ప్లేయర్స్‌కు ఉత్సాహం కలిగించేలా ఉంది.
పబ్లిషర్స్: అన్‌టోల్డ్ టేల్స్, గేమర్‌స్కైగేమ్స్, ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, నిన్‌టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ వన్, ప్లేస్టేషన్4, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్. జానర్స్: ప్లాట్‌ఫామ్ గేమ్, అడ్వెంచర్ గేమ్.
ఎట్ సీ..
అయోమయంలో ఉండి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో వాడే మాట... ఎట్ సీ. ఉదా: ఐయామ్ కంప్లీట్లీ ఎట్ సీ విత్ ది న్యూ కంప్యూటర్ సిస్టం.
నెససరీ ఇవిల్..
ఒక విషయం నచ్చకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడం. ఉదా: మోస్ట్ అమెరికన్స్ యాక్సెప్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ నెససరీ ఇవిల్.
మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ బటన్..
మైక్రోసాఫ్ట్ తన విండోస్ కీబోర్డులకు కొత్త ఏఐ బటన్‌ను యాడ్ చేస్తుంది. రిబ్బన్–షేప్‌డ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఏఐ–పవర్డ్ చాట్‌బాట్ కోపైలట్ ఆన్‌లైన్‌లో ఫర్నీచర్ సెర్చింగ్, డ్రాఫ్ట్ టెక్ట్స్, ఇమేజ్‌లను క్రియేట్ చేయడం, ఐడియాలను సాంగ్స్‌గా మలచడానికి యూజర్‌లకు ఉపయోగపడుతుంది. కొత్త బటన్ స్పేస్‌బార్‌కు కుడి వైపున ఉంటుంది.
రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్..
రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్ మన దేశంలో లాంచ్ అయింది. ఈ ఇ–ఇంక్ ట్యాబ్ రోజువారీ నోటుబుక్‌లాగే పనిచేస్తుంది. నోటుబుక్ రాసిన అనుభూతిని ఇస్తుంది. నోట్స్ తీసుకోవడానికి, డాక్యుమెంట్‌లను రివ్యూ చేయడానికి... రకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని వివరాలు..
- 10.3 అంగుళాల మోనో క్రోమ్ డిజిటల్ పేపర్ డిస్‌ప్లే
- రిజల్యూషన్: 1,872్ఠ1,404 పిక్సెల్స్
- 1.2 జీహెచ్ డ్యూయల్–కోర్ ఏఆర్‌ఏం చిప్‌సెట్
- వై–ఫై
- బ్యాటరీ: 3.000 ఎంఏహెచ్
Comments
Please login to add a commentAdd a comment