శాస్త్ర సాంకేతికత రోజూరోజూ సరికొత్త పుంతలను తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడంలో ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ఎప్పుడూ ముందు ఉంటుంది. సౌండ్‌నుపయోగించి స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేసే సాంకేతికతను, స్మార్ట్‌ఫోన్స్‌తో భూకంపాలను గుర్తించే టెక్నాలజీలను షావోమీ అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కాంటాక్ట్ లేస్ పేమెంట్స్‌లో భాగంగా సరికొత్త ఒరవడిని తెచ్చేందుకు షావోమీ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!
స్మార్ట్‌వాచ్ బెల్ట్(స్ట్రాప్)నుపయోగించి లావాదేవీలను చేసే టెక్నాలజీని షావోమీ త్వరలోనే ఆవిష్కరించనుంది. షావోమీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి స్మార్ట్‌వాచ్ స్ట్రాప్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ సాంకేతికతను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో నమోదు చేసినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.స్మార్ట్‌వాచ్స్‌కు అమర్చే ఈ కొత్త స్ట్రాప్‌లు నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ)తో పనిచేయనున్నాయి. ఎన్‌ఎఫ్‌సీ లావాదేవీల్లో భాగంగా షావోమీ తన భాగస్వాములుగా రూపే, ఆర్‌బీఎల్, జెటాతో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ స్ట్రాప్‌ను త్వరలోనే టీజ్ చేస్తున్నట్లు రఘు ట్విటర్ పేర్కొన్నారు.
Today we announced our entry into the FUTURE OF CONTACTLESS PAYMENTS at the Global Fintech Festival.
— Raghu Reddy (@RaghuReddy505) September 28, 2021
Thrilled to announce that we will be launching the Xiaomi NFC Mi Pay straps soon.
Working with @RuPay_npci, RBL & Zeta to make this happen.
Stay tuned. pic.twitter.com/5yD2eywhPO
చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..!
Comments
Please login to add a commentAdd a comment