NFC Payment Services
-
గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..!
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫాం గూగుల్ పే తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ను అందించింది. మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. పైన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం..! యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్ టు పే' ఫీచర్ కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా సజావుగా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కేవలం డెబిట్, క్రెడిట్ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్ టెర్మినల్ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్ పే యూజర్లు చేయవచ్చును. నీయర్ టూ ఫీల్డ్(ఎన్ఎఫ్సీ) పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది. ట్యాప్ టూ పే ఫీచర్‌తో యూపీఐ పేమెంట్స్ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్ పే బిజినెస్ హెడ్ సశిత్ శివానందన్ అన్నారు. అంతేకాకుండా అవుట్లెట్లలో, క్యూ మేనేజ్మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్ పేతో భాగస్వామిగా పైన్ ల్యాబ్స్ ఉన్నందుకు సంతోషిస్తున్నామని పైన్ ల్యాబ్స్ బిజినెస్ చీఫ్ ఖుష్ మెహ్రా అన్నారు. భారత్‌లో కాంటక్ట్‌లెస్ పేమెంట్స్‌ను అందించేందుకు పైన్ ల్యాబ్స్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! -
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇకపై మరింత సులువుగా..!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ యూజర్ల కోసం కొత్తగా ట్యాప్-టు-పే ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో తమ ఐఫోన్లను పేమెంట్ టెర్మినల్స్‌గా మార్చవచ్చునని యాపిల్ వెల్లడించింది. ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్లను ఉపయోగించి యాపిల్ పే, కాంటాక్ట్‌లెస్ క్రెడిట్,డెబిట్ కార్డ్, ఇతర డిజిటల్ వాలెట్లకు అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండానే లావాదేవీలను జరపవచ్చునని యాపిల్ పేర్కొంది. ఈ మోడల్స్‌లో అందుబాటులో..! యాపిల్ ప్రవేశపెడుతున్న ఈ కొత్త ట్యాప్-టు-పే ఫీచర్ ఐఫోన్ ఎక్స్ఎస్, తదుపరి మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. ఇది పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్ డెవలపర్లు వారి iOS యాప్‌లలో కలిసిపోవడానికి, వారి కస్టమర్లకు పేమెంట్ ఎంపికగా అందించడానికి మరింత సులువుగా ఉండనుంది. ఈ ఏడాది చివర్లో యూఎస్‌లోని మార్చంట్స్, యాపిల్ స్టోర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డిస్కవర్, మాస్టర్ కార్డ్ , వీసా వంటి కార్డులతో సహా ఇతర పేమెంట్ యాప్స్‌తో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ట్యాప్-టు-పే ఫీచర్ పని చేస్తుందని యాపిల్ తెలిపింది. ట్యాప్ టూ పే ఎలా పనిచేస్తోదంటే..! యాపిల్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టనున్న ట్యాప్-టు-పే ఫీచర్ NFC(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీ సహాయంతో పనిచేయనుంది. ఇక యూజర్ల గోప్యత విషయంలో యాపిల్ ఐఫోన్లలో ట్యాప్-టు-పేతో యాపిల్ పేని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కస్టమర్ల పేమెంట్ డేటా సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ తొలుత అమెరికాలో రానుండగా.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. చదవండి: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..! -
బెల్ట్‌తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..!
శాస్త్ర సాంకేతికత రోజూరోజూ సరికొత్త పుంతలను తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలను రూపొందించడంలో ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ఎప్పుడూ ముందు ఉంటుంది. సౌండ్‌నుపయోగించి స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసే సాంకేతికతను, స్మార్ట్ఫోన్స్తో భూకంపాలను గుర్తించే టెక్నాలజీలను షావోమీ అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కాంటాక్ట్ లేస్ పేమెంట్స్‌లో భాగంగా సరికొత్త ఒరవడిని తెచ్చేందుకు షావోమీ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! స్మార్ట్‌వాచ్ బెల్ట్(స్ట్రాప్)నుపయోగించి లావాదేవీలను చేసే టెక్నాలజీని షావోమీ త్వరలోనే ఆవిష్కరించనుంది. షావోమీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘురెడ్డి స్మార్ట్‌వాచ్ స్ట్రాప్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ సాంకేతికతను గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో నమోదు చేసినట్లు ట్విటర్లో పేర్కొన్నారు.స్మార్ట్వాచ్స్కు అమర్చే ఈ కొత్త స్ట్రాప్‌లు నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ)తో పనిచేయనున్నాయి. ఎన్ఎఫ్సీ లావాదేవీల్లో భాగంగా షావోమీ తన భాగస్వాములుగా రూపే, ఆర్బీఎల్, జెటాతో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ స్ట్రాప్‌ను త్వరలోనే టీజ్ చేస్తున్నట్లు రఘు ట్విటర్ పేర్కొన్నారు. Today we announced our entry into the FUTURE OF CONTACTLESS PAYMENTS at the Global Fintech Festival. Thrilled to announce that we will be launching the Xiaomi NFC Mi Pay straps soon. Working with @RuPay_npci, RBL & Zeta to make this happen. Stay tuned. pic.twitter.com/5yD2eywhPO — Raghu Reddy (@RaghuReddy505) September 28, 2021 చదవండి: జియో ఫోన్ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
ఐసీఐసీఐ నుంచి ‘ఎన్ఎఫ్సీ’ చెల్లింపు సర్వీసులు
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాతో కలసి ‘ట్యాప్ ఎన్ పే’ పేరిట చెల్లింపుల సేవలను ప్రారంభించింది. ఇందులో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ (ఎన్ఎఫ్సీ) టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధానంలో ఎన్ఎఫ్సీ టెక్నాలజీ గల మొబైల్ ఫోన్ లేదా ట్యాగ్‌ను ఆయా వర్తకుల కౌంటర్లోని ప్రత్యేక మెషీన్‌కు తాకించడం ద్వారా ఆన్లైన్ మాధ్యమంలో షాపు ఖాతాలోకి నగదు బదిలీ అవుతుంది. ఇందుకోసం వర్తకులు ముందుగా రిజిస్టరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ కస్టమర్లను జోడించుకోవాలి. ప్రస్తుతం ఆఫీస్ క్యాంటీన్లు వంటి కొన్ని చోట్లకు మాత్రమే ఇది పరిమితమని, దీన్ని డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులాగా అన్ని చోట్లా ఉపయోగించుకోవడానికి వీలు ఉండదని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. కేవలం తమ బ్యాంకు ఖాతాదారులే కాకుండా ఇతరత్రా ఏ బ్యాంకులో అకౌంటు ఉన్నవారైనా ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.