హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ హావెల్స్ ఇండియా వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రూ.360 కోట్లతో రాజస్థాన్‌లోని ఘిలోట్‌లో లాయిడ్ బ్రాండ్ ఏసీ తయారీ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని, వచ్చే మార్చి నాటికి నిర్వహణలోకి వస్తుందని హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్‌రాయ్ గుప్తా చెప్పారు. శనివారమిక్కడ విపణిలోకి ‘గ్రాండే’ నూతన శ్రేణి ఏసీలను ప్రవేశపెట్టారు. గతేడాది లాయిడ్ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
బెంగళూరులో ఏర్పాటు చేయనున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తామని.. ఇందులో సుమారు 100 మంది నూతన ఇంజనీర్లు, పరిశోధకుల అవసరముందని తెలిపారు. నూతన శ్రేణి ‘గ్రాండే’ ఎయిర్ కండీషన్ (ఏసీ)లను ప్రవేశపెట్టింది. 3 వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఏసీలు ప్రభుత్వ గుర్తింపు ఐఎస్‌ఈఈఆర్ రేటింగ్‌ను పొందాయని కంపెనీ తెలిపింది. ధరల శ్రేణి రూ.45,990 నుంచి రూ.79,990 మధ్య ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment