పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం | Mahindra Two Wheelers, Paytm tie up to sell bike, scooter online | Sakshi
Sakshi News home page

పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం

Published Thu, Mar 12 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం

పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం

సెంచురో, రొడియో యూజోలను ఆన్‌లైన్‌లో కొనొచ్చు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్, మొబైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మహీంద్రా సెంచురో మోటార్ సైకిళ్లను, మహీంద్రా రొడియో యూజో రేంజ్ స్కూటర్లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని మహీంద్రా టూవీలర్స్ బుధవారం తెలియజేసింది. దీంతో వినియోగదారులు పేటీఎం ద్వారా కూడా ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేయవచ్చు.

వినియోగదారులకు చేరువ కావడానికి ఇదొక వినూత్న మార్గమని మహీంద్రా టూవీలర్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పేటీఎంతో భాగస్వామ్యం కారణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో సహా ఇంటర్నెట్ ఉపయోగించే వారందరికీ మరింత చేరువవుతామని తెలియజేశారు. ఈ ఒప్పందం కారణంగా తమ ఆటోమోటివ్ విభాగానికి మరింత ఊపు వస్తుందని పేటీఎం జనరల్ మేనేజర్  అమిత్ బగారియా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement