Mahindra Two Wheelers
-
మహీంద్రా కొత్త ‘మోజో’
ముంబై: మహీంద్రా టూవీలర్స్ తాజాగా తన ప్రీమియం స్పోర్ట్స్ టూరర్ బైక్ ‘మోజో’లో కొత్త వేరియంట్ ‘మోజో యూటీ (యూనివర్సల్ టూరర్) 300’ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ నెలలోని మోజో యూటీ–300 బుకింగ్స్‌పై రూ.10,000 విలువైన ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ తెలిపింది. మోజో యూటీ–300లో 300 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, కాంపాక్ట్ డిజిటల్ ప్యానెల్, కార్బ్యరేటర్ ఫ్యూయెల్ సిస్టమ్, 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్స్, 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా స్టాండర్డ్ మోజో వేరియంట్ ‘మోజో ఎక్స్‌టీ (ఎక్స్ట్రీమ్ టూరర్) 300’తో పోలిస్తే తాజా వేరియంట్ ధర రూ.23,000 వరకు చౌక. -
పేటీఎంతో మహీంద్రా టూవీలర్స్ ఒప్పందం
సెంచురో, రొడియో యూజోలను ఆన్లైన్లో కొనొచ్చు న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్, మొబైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మహీంద్రా సెంచురో మోటార్ సైకిళ్లను, మహీంద్రా రొడియో యూజో రేంజ్ స్కూటర్లను ఆన్లైన్లో విక్రయించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని మహీంద్రా టూవీలర్స్ బుధవారం తెలియజేసింది. దీంతో వినియోగదారులు పేటీఎం ద్వారా కూడా ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు చేరువ కావడానికి ఇదొక వినూత్న మార్గమని మహీంద్రా టూవీలర్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పేటీఎంతో భాగస్వామ్యం కారణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో సహా ఇంటర్నెట్ ఉపయోగించే వారందరికీ మరింత చేరువవుతామని తెలియజేశారు. ఈ ఒప్పందం కారణంగా తమ ఆటోమోటివ్ విభాగానికి మరింత ఊపు వస్తుందని పేటీఎం జనరల్ మేనేజర్ అమిత్ బగారియా చెప్పారు. -
మహీంద్రా 300 సీసీ బైక్ మోజో వస్తోంది..
మే నాటికి భారత్‌లోకి * కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా * ఏపీ, తెలంగాణలో గస్టో స్కూటర్ విడుదల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా టూ వీలర్స్ ఈ ఏడాది ఏప్రిల్-మే నాటికి భారత మార్కెట్లో 300 సీసీ బైక్ ‘మోజో’ విడుదల చేయనుంది. 2010లో తొలిసారిగా ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్‌ను ప్రదర్శించారు. మహీంద్రా టూ వీలర్స్ నుంచి ప్రీమి యం బైక్ ఇదే. ప్రోటోటైప్ మొదలు ఇప్పటి వరకు బైక్ డిజైన్‌ను మారుస్తూ వస్తున్నారు. కస్టమర్ల సూచనల ఆధారంగా కొత్త డిజైన్‌తో మోజోను తీసుకొస్తున్నట్టు కంపెనీ సేల్స్, కస్టమర్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి గస్టో స్కూటర్ విడుదల సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 125 సీసీ స్కూటర్..: మహీంద్రా టూ వీలర్స్ ప్రస్తుతం స్కూటర్ల విభాగంలో ఆరు మోడళ్లు, మూడు రకాల బైక్‌లను విక్రయిస్తోంది. కొత్త ఫీచర్లతో ఆరు నెలల కో మోడల్‌ను విడుదల చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 125 సీసీ విభాగంలో మరో స్కూటర్‌ను ఈ ఏడాదే మార్కెట్లోకి తెస్తోంది. 150 సీసీ బైక్‌ల విభాగంలోకి అడుగు పెడుతోంది. 1.6 కోట్ల యూనిట్ల భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మహీంద్రాకు 3% వాటా ఉంది. రెండేళ్లలో 5-7% ల క్ష్యంగా చేసుకుంది. టూ వీలర్ మార్కెట్లో అన్ని విభాగాల్లో ప్రవేశిస్తామని ధర్మేంద్ర మిశ్రా చెప్పారు. రుతుపవనాలు అనుకూలిస్తే 2015లో మార్కెట్ 10-15% వృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో గస్టో ధర హెచ్ఎక్స్ వేరియంట్ రూ.48,100, వీఎక్స్ రూ.50,100. -
మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్
51% వాటా కొనుగోలుకు ఒప్పందం డీల్ విలువ రూ. 217 కోట్లు ముంబై: ఆటోమొబైల్ సంస్థ ప్యూజో మోటోసైకిల్స్లో 51 శాతం వాటాలను దేశీ దిగ్గజం మహీంద్రా టూ వీలర్స్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 28 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 217 కోట్లు). ఇందుకు సంబంధించిన ఒప్పందంపై మంగళవారం ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్‌కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్ఏ గ్రూప్‌లో ప్యూజో మోటోసైకిల్స్ భాగం. తాజా బైండింగ్ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా మహీంద్రా టూ వీలర్స్ సంస్థ.. ముందుగా ప్యూజోలో 15 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. తదుపరి మరో 13 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ మూడు నెలల్లోగా పూర్తి కావొచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. రెండేళ్ల పాటు ఎటువంటి పునర్వ్యవస్థీకరణ చర్యలు ఉండవని, ఇప్పుడున్న మేనేజ్మెంట్ బృందాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఎంఅండ్ఎంతో ఒప్పందం తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడగలదని ప్యూజో స్కూటర్స్ ఎండీ ఫ్రెడరిక్ ఫేబర్ పేర్కొన్నారు. దాదాపు 116 ఏళ్ల చరిత్ర గల ప్యూజో యూరప్‌లో ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీకి పేరొం దింది. ప్రస్తుతం కంపెనీ ద్విచక్రవాహనాల విభాగం నష్టాల్లో ఉంది. మరోవైపు, కొన్నాళ్ల క్రితమే ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన ఎంఅండ్ఎం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మంగళవారం ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 2.3% నష్టంతో రూ. 1,359 వద్ద క్లోజైంది. -
ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ ఈ ఏడాది 4 కొత్త టూవీలర్లను మార్కెట్లోకి తెస్తోంది. వీటిల్లో ఒక కొత్త స్కూటర్ మోడల్, ప్రారంభస్థాయి మోటార్ సైకిల్, ప్రస్తుతమున్న మోడళ్లలో రెండు వేరియంట్లు ఉంటాయనిమహీంద్రా టూ వీలర్స్ చీఫ్(కార్యకలాపాల విభాగం) వీరేన్ పొప్లి చెప్పారు. ఇక ఎగుమతులు మూడింతలు పెంచుకోవడం లక్ష్యంగా మరో నాలుగు కొత్త దేశాలకు తన వాహనాలను ఎగుమతి చేయనున్నామని పేర్కొన్నారు. కొలంబియా, నైజీరియా, ఇంకా మరో 2 దేశాలకు టూవీలర్లను ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే 300 సీసీ మోజో బైక్‌ను అందుబాటులోకి తెస్తామని, 100-110 సిసీ సెగ్మెంట్లో కొత్త మోటార్ సైకిల్‌ను అందించనున్నామని వివరించారు. తమ ప్రధాన మోటార్ బైక్, సెంచురో మంచి అమ్మకాలు సాధిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంట్రీ లెవల్ బైక్, పంటెరోను ఆపేస్తామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పంటెరో ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన యారో బైక్ ఎగుమతులను కొనసాగిస్తామని వివరించారు. డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, దీంతో దేశీయంగా అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో 7,849గా ఉన్న టూవీలర్ల విక్రయాలు ఈ ఏడాది జూన్‌లో 83 శాతం వృద్ధితో 14,389 కు పెరిగాయని పేర్కొన్నారు. -
మహీంద్రా సెంచురో ఎన్1 @ రూ.45,700
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ కొత్త మోటార్‌బైక్, సెంచురో ఎన్1ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.45,700(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(టూ వీలర్ సెక్టార్) అనూప్ మాధుర్ తెలిపారు. ప్రస్తుతమున్న సెంచురో బైక్ ధరతో పోల్చితే ఈ కొత్త సెంచురో బైక్ ధర రూ.2,000 తక్కువ. ఈ బైక్ 85.4 కిమీ మైలేజీనిస్తుందని తెలిపారు. సెంచురో బైక్‌లను మార్కెట్లోకి తెచ్చి ఆర్నెళ్లయిందని, ఇప్పటివరకూ లక్ష బైక్‌లు విక్రయించామని పేర్కొన్నారు. సెంచురో బైక్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి పీతంపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని మహీంద్రా టూ వీలర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరేన్ పొప్లి పేర్కొన్నారు. ప్రస్తుతం 390 డీలర్లు, 1,000 టచ్ పాయింట్లతో నెట్‌వర్క్‌ను విస్తరించామని పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో 10 కొత్త బైక్‌లను అందించాలనేది కంపెనీ యోచన. ప్రస్తుతం 125 సీసీ స్కూటర్లందిస్తున్నామని, త్వరలో 110 సీసీ స్కూటర్‌ను తెస్తామని పేర్కొంది. బైక్ ప్రత్యేకతలు.... 110 సీసీ ఎంసీఐ-5 ఇంజిన్. 5-స్టెప్ అడ్జెస్టబుల్ రియర్ సస్పెన్షన్, ఆకర్షణీయమైన టాటూ గ్రాఫిక్స్. ముందు, వెనక వైపు ఎల్ఈడీలు, 4-స్పీడ్ గేర్లు. 0-60 కీ.మీలను 8.85 సెకన్లలోనే అందుకునే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85.2 కీ.మీ. ఐదేళ్ల వారంటీ. కార్లకు ఉండే కీ లాంటి ఫ్లిఫ్ కీ(ఎక్కడి నుంచైనా కీకు ఉన్న బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది), ఇంజిన్ ఇమ్మోబిలైజర్తో కూడిన యాంటీ థెఫ్ట్ అలారమ్ (రూ.45 లక్షల సూపర్ బై కుల్లోనే ఈ ఫీచర్ఉంది). ఫైండ్ మీ ల్యాంప్స్(పార్కింగ్ చేసినప్పుడు ఈజీగా బైక్‌ను కనుగొనేందుకు కీపై ఉన్న బటన్ నొక్కితే లైట్లు వెలిగే ఫీచర్) కార్లలో ఉండే గైడ్ ల్యాంప్స్వంటి ఫీచర్లున్నాయి.