మహీంద్రా 300 సీసీ బైక్ మోజో వస్తోంది..
మే నాటికి భారత్‌లోకి
* కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా
* ఏపీ, తెలంగాణలో గస్టో స్కూటర్ విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా టూ వీలర్స్ ఈ ఏడాది ఏప్రిల్-మే నాటికి భారత మార్కెట్లో 300 సీసీ బైక్ ‘మోజో’ విడుదల చేయనుంది. 2010లో తొలిసారిగా ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్‌ను ప్రదర్శించారు. మహీంద్రా టూ వీలర్స్ నుంచి ప్రీమి యం బైక్ ఇదే. ప్రోటోటైప్ మొదలు ఇప్పటి వరకు బైక్ డిజైన్‌ను మారుస్తూ వస్తున్నారు. కస్టమర్ల సూచనల ఆధారంగా కొత్త డిజైన్‌తో మోజోను తీసుకొస్తున్నట్టు కంపెనీ సేల్స్, కస్టమర్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి గస్టో స్కూటర్ విడుదల సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
మరో 125 సీసీ స్కూటర్..: మహీంద్రా టూ వీలర్స్ ప్రస్తుతం స్కూటర్ల విభాగంలో ఆరు మోడళ్లు, మూడు రకాల బైక్‌లను విక్రయిస్తోంది. కొత్త ఫీచర్లతో ఆరు నెలల కో మోడల్‌ను విడుదల చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. 125 సీసీ విభాగంలో మరో స్కూటర్‌ను ఈ ఏడాదే మార్కెట్లోకి తెస్తోంది. 150 సీసీ బైక్‌ల విభాగంలోకి అడుగు పెడుతోంది. 1.6 కోట్ల యూనిట్ల భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మహీంద్రాకు 3% వాటా ఉంది.
రెండేళ్లలో 5-7% ల క్ష్యంగా చేసుకుంది. టూ వీలర్ మార్కెట్లో అన్ని విభాగాల్లో ప్రవేశిస్తామని ధర్మేంద్ర మిశ్రా చెప్పారు. రుతుపవనాలు అనుకూలిస్తే 2015లో మార్కెట్ 10-15% వృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో గస్టో ధర హెచ్‌ఎక్స్ వేరియంట్ రూ.48,100, వీఎక్స్ రూ.50,100.