
ముంబై: మహీంద్రా టూవీలర్స్ తాజాగా తన ప్రీమియం స్పోర్ట్స్ టూరర్ బైక్ ‘మోజో’లో కొత్త వేరియంట్ ‘మోజో యూటీ (యూనివర్సల్ టూరర్) 300’ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ నెలలోని మోజో యూటీ–300 బుకింగ్స్‌పై రూ.10,000 విలువైన ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ తెలిపింది.
మోజో యూటీ–300లో 300 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, కాంపాక్ట్ డిజిటల్ ప్యానెల్, కార్‌బ్యరేటర్ ఫ్యూయెల్ సిస్టమ్, 17 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్స్, 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా స్టాండర్డ్ మోజో వేరియంట్ ‘మోజో ఎక్స్‌టీ (ఎక్స్‌ట్రీమ్ టూరర్) 300’తో పోలిస్తే తాజా వేరియంట్ ధర రూ.23,000 వరకు చౌక.
Comments
Please login to add a commentAdd a comment