మహీంద్రా సెంచురో ఎన్1 @ రూ.45,700
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ కొత్త మోటార్‌బైక్, సెంచురో ఎన్1ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.45,700(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్(టూ వీలర్ సెక్టార్) అనూప్ మాధుర్ తెలిపారు. ప్రస్తుతమున్న సెంచురో బైక్ ధరతో పోల్చితే ఈ కొత్త సెంచురో బైక్ ధర రూ.2,000 తక్కువ. ఈ బైక్ 85.4 కిమీ మైలేజీనిస్తుందని తెలిపారు. సెంచురో బైక్‌లను మార్కెట్లోకి తెచ్చి ఆర్నెళ్లయిందని, ఇప్పటివరకూ లక్ష బైక్‌లు విక్రయించామని పేర్కొన్నారు. సెంచురో బైక్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి పీతంపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని మహీంద్రా టూ వీలర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరేన్ పొప్లి పేర్కొన్నారు. ప్రస్తుతం 390 డీలర్లు, 1,000 టచ్ పాయింట్లతో నెట్‌వర్క్‌ను విస్తరించామని పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో 10 కొత్త బైక్‌లను అందించాలనేది కంపెనీ యోచన. ప్రస్తుతం 125 సీసీ స్కూటర్లందిస్తున్నామని, త్వరలో 110 సీసీ స్కూటర్‌ను తెస్తామని పేర్కొంది.
బైక్ ప్రత్యేకతలు....
- 110 సీసీ ఎంసీఐ-5 ఇంజిన్. 5-స్టెప్ అడ్జెస్టబుల్ రియర్ సస్పెన్షన్, ఆకర్షణీయమైన టాటూ గ్రాఫిక్స్. ముందు, వెనక వైపు ఎల్‌ఈడీలు, 4-స్పీడ్ గేర్లు.
- 0-60 కీ.మీలను 8.85 సెకన్లలోనే అందుకునే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85.2 కీ.మీ.
- ఐదేళ్ల వారంటీ. కార్లకు ఉండే కీ లాంటి ఫ్లిఫ్ కీ(ఎక్కడి నుంచైనా కీకు ఉన్న బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది), ఇంజిన్ ఇమ్మోబిలైజర్‌తో కూడిన యాంటీ థెఫ్ట్ అలారమ్ (రూ.45 లక్షల సూపర్ బై కుల్లోనే ఈ ఫీచర్‌ఉంది).
- ఫైండ్ మీ ల్యాంప్స్(పార్కింగ్ చేసినప్పుడు ఈజీగా బైక్‌ను కనుగొనేందుకు కీపై ఉన్న బటన్ నొక్కితే లైట్లు వెలిగే ఫీచర్) కార్లలో ఉండే గైడ్ ల్యాంప్స్‌వంటి ఫీచర్లున్నాయి.