భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్‌లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు.
"నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.
వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్‌లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment