Mahindra Finance Announced Launch of Lease-Based Vehicle Subscription Business for the Urban Centres - Sakshi
Sakshi News home page

Mahindra : కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి

Nov 18 2021 8:56 AM | Updated on Nov 18 2021 12:22 PM

Mahindra India Offers Finance Quick Lease scheme In Hyderabad - Sakshi

Mahindra Finance Vehicle Leasing & Subscription Business Under Quiklyz Brand: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ క్విక్‌లీజ్‌ పేరుతో లీజ్‌ ఆధారిత సబ్‌స్క్రిప్షన్‌ సేవలను పరిచయం చేసింది. ఆన్‌లైన్‌ వేదికగా రిటైల్, కార్పొరేట్‌ క్లయింట్లు లక్ష్యంగా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన కార్లను అద్దె విధానంలో ఆఫర్‌ చేస్తుంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు అవసరం లేదు. కనీస చందా నెలకు రూ.10,000 ఉంది. 24–60 నెలల కాలానికి కస్టమర్‌ తనకు నచ్చిన సరికొత్త కారును అద్దెకు తీసుకోవచ్చు. 

ఈ పద్దతిలో
క్విక్‌లీజ్‌ వెబ్‌సైట్లో లాగిన్‌ అయి కారుతోపాటు కంపెనీ నుంచి ఎటువంటి సేవలు కావాలో ఎంచుకోవాలి. అవసరమైన పత్రాలు జతచేసి సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లిస్తే చాలు. స్టాక్‌నుబట్టి కొద్ది రోజుల్లోనే కస్టమర్‌ పేరునే వైట్‌ నంబర్‌ ప్లేట్‌తో ఇంటి ముంగిట వాహనం ఉంటుంది. కాల పరిమితి తర్వాత కారును వెనక్కి ఇవ్వొచ్చు. లేదా అదే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మరో కారుకు అప్‌గ్రేడ్‌కూ అవ కాశం ఉంది. 

ఎనిమిది మోడళ్లు
బుధవారం నాటికి ఎనిమిది బ్రాండ్లకు చెందిన 22 మోడళ్లు కొలువుదీరాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను జోడిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌సహా ఎనిమిది నగరాల్లో క్విక్‌లీజ్‌ అందుబాటులో ఉంది. ఏడాదిలో 30 నగరాలకు సేవలను విస్తరించాలన్నది సంస్థ ఆలోచన. 
- హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement