సాక్షి, హైదరాబాద్ : మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ఎలక్ర్టిక్ మొబిలిటీ లిమిటెడ్ నూతన ఎలక్ర్టిక్ త్రీవీలర్ మహీంద్రా ట్రియోను సోమవారం తెలంగాణ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. రాయితీల అనంతరం 2.7 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ ధరతో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. మహీంద్రా ట్రియో ఎలక్ర్టిక్ ఆటోనూ పూర్తిగా భారత్‌లో రూపొందించి అభివృద్ది చేశారు. ఈ వాహనం కేవలం 2.3 సెకన్లలోనే 0 నుంచి 20 కేఎంపీహెచ్ వేగాన్ని అందిపుచ్చుకుంటుంది. మహీంద్రా ట్రియోతో వాహనదారులు ఏటా 45వేల రూపాయలను ఆదా చేసుకనే వెసులుబాటు లభిస్తుంది.
ఈ వాహనాన్ని కేవలం 50 వేల రూపాయల డౌన్‌పేమెంట్ చెల్లించి ఆపై మహీంద్రా ఫైనాన్స్, ఎస్‌బీఐ నుంచి అతితక్కువ వడ్డీరేటు (10.8)కు రుణాలను పొందవచ్చు. తెలంగాణ ప్రకటించిన ఎలక్ర్టానిక్ వాహన విధానంతో రాష్ట్రంలో ఎలక్ర్టిక్ వాహనాలు అందుబాట ధరల్లో అందరికీ చేరువయ్యాయని మహీంద్రా ఎలక్ర్టిక్ ఎండీ, సీఈఓ మహేష్ బాబు పేర్కొన్నారు. ఎలక్ర్టిక్ త్రీవీలర్స్ ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా అనుకూలంగా ఉంటాయని అన్నారు. మూడు సంవత్సరాల ప్రామాణిక వారెంటీ సహా అమ్మకం తర్వాత మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. దేశవ్యాప్తంగా 140కి పైగా డీలర్‌షిప్‌లతో కూడిన సేవా నెట్‌వర్క్ ఉందని తెలిపారు. చదవండి : 30 ఏళ్ల కృషి; ఆనంద్ మహింద్రా ఔదార్యం
Comments
Please login to add a commentAdd a comment