
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వెల్లడించింది. మహారాష్ట్ర విద్యుత్ వాహనాల ప్రోత్సాహక పథకం కింద తమ ప్రణాళికకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.
‘మహారాష్ట్రలోని పుణేలో మా బార్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) కోసం తయారీ, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అనుబంధ సంస్థ ద్వారా వచ్చే 7–8 ఏళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. ఎంఅండ్‌ఎం ఆగస్టులో 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. వీటిలో నాలుగు వాహనాలు 2024–26 మధ్యలో మార్కెట్లోకి రానున్నాయి. ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది.
చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా!
Comments
Please login to add a commentAdd a comment