ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బైక్, స్కూటర్, కార్ల తయారీ కంపెనీల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఈవీ మార్కెట్లో త్రీ వీలర్ వాహన తయారుదారుల జోరు కొనసాగనుంది. తాజాగా ఎలక్ట్రిక్ కమర్షియల్ వేహికల్ కంపెనీ యూలర్ మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ ఆటోను భారత మార్కెట్లోకి నేడు విడుదల చేసింది. ఈ కొత్త యూలర్ హైలోడ్ ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ ఆటోను భారతదేశంలో రూ.3,49,999కు లాంఛ్ చేశారు. ఈ ఆటో ప్రీ బుకింగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓపెన్ అయ్యాయి.
శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో
ఈ యూలర్ హైలోడ్ ఈవీ ఆటోను భారతదేశంలో డిజైన్ చేశారు. ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ అని కంపెనీ పేర్కొంది. ఈ ఆటో 688 కిలోల వరకు లోడ్ మోయగలదు. అలాగే, ఈ యూలర్ హైలోడ్ ఈవి 12.4 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్) వరకు వెళ్లగలదు. దీని బ్యాటరీ ప్యాక్ ఇన్ బిల్ట్ థర్మల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ & లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ జీవిత కాలం ఎక్కువగా వస్తుంది. అంతేగాక, ఇది ఐపీ67 సర్టిఫైడ్ పొందడంతో నీటి నిరోధకంగా పనిచేస్తుంది. ఫ్లీట్ ట్రాకింగ్, బ్యాటరీ మానిటరింగ్, రియల్ టైమ్ ఛార్జింగ్ కొరకు అధునాతన టెలిమాటిక్స్ సాఫ్ట్ వేర్ ఇందులో ఉంది.
(చదవండి: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త!)
ఈ ఎలక్ట్రిక్ కార్గో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ మోటార్ 10.96 కిలోవాట్లు పీక్ పవర్, 88.55 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోకు 200 మీ.మీ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్న ఏకైక వాహనం యూలర్ హైలోడ్ ఈవీ. బెస్ట్ ఇన్ క్లాస్ స్పేస్, పేలోడ్, పవర్ & డ్రైవర్ కంఫర్ట్ కొరకు స్మార్ట్ ఎర్గోనమిక్స్ తో డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ తన కొత్త 'ఛార్జ్ ఆన్ వీల్స్' మొబైల్ సర్వీస్ స్టేషన్ కూడా ప్రవేశపెట్టింది, ఇది ఏదైనా వాహనం బ్యాటరీ ఛార్జింగ్ మార్గం మధ్యలో అయిపోతే చార్జ్ చేసుకోవడానికి 'ఛార్జ్ ఆన్ వీల్స్' సర్వీస్ ఉపయోగపడుతుంది. దీనిని ఫాస్ట్ చార్జర్ సహాయంతో 15 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. యూలర్ మోటార్స్ వాహనంపై 3 సంవత్సరాల/80,000 కిలోమీటర్ల వారెంటీని అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment