చెన్నై: గత కొంత కాలంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ లుక్‌ని విడుదల చేసింది. అనంతరం తమ తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ఎక్స్‌యూవీ 400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. 2022 డిసెంబర్‌లో టెస్ట్ డ్రైవ్‌లు, 2023 జనవరి తొలి వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని కంపెనీ ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ తెలిపారు.
ఇదిలా ఉండగా గతంలో మహీంద్రా తన ఎక్స్‌యువి700 ఎస్‌యూవి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసి ఓ రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి మహీంద్రా ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్‌లో పాత రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా కూడా ఈ కారుపై హైప్ క్రియేట్ చేసేందకు సెప్టంబర్ 8 సాయంత్రం 7.30 ఎక్స్‌యూవీ 400 కారు లుక్‌కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో చూశాక కొంతకాలంగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న టాటా నెక్సాన్ SUV వంటి వాటికి గట్టి పోటినే ఇచ్చేలా కనిపిస్తుంది.
చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment