
దమ్ముకు ప్రత్యేకం మహీంద్రా 575 ట్రాక్టర్
వ్యవసాయ పనులకు వినియోగపడే 575 మోడల్ ట్రాక్టర్‌ను రాష్ట్ర మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్: వ్యవసాయ పనులకు వినియోగపడే 575 మోడల్ ట్రాక్టర్‌ను రాష్ట్ర మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. దమ్ము నిర్వహణ తదితర వ్యవసాయ పనులకు అత్యంత అనువైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. రాష్ట్ర మార్కెట్ కోసం 45 హెచ్‌పీ విభాగంలో పవర్ స్టీరింగ్‌తో ఈ ట్రాక్టర్‌ను విడుదల చేసినట్లు వివరించింది. రైతుల కోసం మెరుగైన ఇంధన సామర్థ్యంతోపాటు, అడ్వాన్స్‌డ్ హైడ్రాలిక్స్‌తో అత్యంత సౌకర్యవంతంగా ఈ ట్రాక్టర్‌ను రూపొందించినట్లు తెలిపింది.