
ఈ-కామర్స్‌లోకి ‘మహీంద్రా’
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది...
ముంబై: పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ తాజాగా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించింది. మహీంద్రా ఉత్పత్తులు, సర్వీసుల విక్రయానికి ఎం2ఆల్.కామ్ పేరిట పోర్టల్‌ను ఆవిష్కరించింది. కొత్తగా ఆవిష్కరించిన వాహనం మహీంద్రా టీయూవీ300కి సంబంధించిన ఆర్డర్లు దీని ద్వారా తీసుకోవడం ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ సీఎఫ్‌వో వీఎస్ పార్థసారథి తెలిపారు.