మహీంద్రా మోజో @ రూ.1,69,600 | Mahindra Mojo launched across 11 new states in India | Sakshi
Sakshi News home page

మహీంద్రా మోజో @ రూ.1,69,600

Published Wed, Apr 20 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

మహీంద్రా మోజో @ రూ.1,69,600

మహీంద్రా మోజో @ రూ.1,69,600

మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ మహీంద్రా మోజో బైక్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో...

హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ మహీంద్రా మోజో బైక్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర రూ.1,69,600(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్/వైజాగ్) అని మహీంద్రా టూవీలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.  గత ఏడాది అక్టోబర్‌లో ఈ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని, స్టైల్, పనితీరు, రైడింగ్ క్వాలిటీ వంటి విషయాల్లో ఈ బైక్ కొత్త ఒరవడిని సృష్టించిందని మహీంద్ర టూ వీలర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు.

ఈ బైక్ హైదరాబాద్‌లోని సిల్వర్ మోటార్స్, యువిఖ ఆటోమోటివ్స్, శ్రీ సూర్య వీల్స్ ప్రైవేట్,  వైజాగ్‌లోని రామ్‌కార్తీక్ మోటార్స్‌ల వద్ద లభ్యమవుతుందని వివరించారు. మోజో ట్రైబ్ మొబెల్ యాప్ ద్వారా మోజో బైక్ వినియోగదారులు తమ రైడింగ్ అనుభవాలను షేర్, అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపారు. మోజో బైక్‌లో డబుల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్ (డీఓహెచ్‌సీ) టెక్నాలజీతో కూడిన ఇంజిన్, రెండు పొగ గొట్టాలు, ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఇగ్నిషన్, ఇరిడియమ్ స్పార్క్ ప్లగ్, ట్విన్ పాడ్ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement