రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం ఉపయోగించే ‘ఏఎన్32’ విమానాలను తయారు చేసే ఉక్రెయిన్ సంస్థ ఆంటనోవ్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ వెల్లడించింది. మిలిటరీ, పారా మిలిటరీ, సాధారణ రవాణా అవసరాలకు ఉపయోగపడే ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి ఈ జేవీ ఉపయోగపడనున్నట్లు తెలిపింది. భారత్ కొత్త రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవడం, 105 ఏఎన్ 32 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసుకునే ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వివిధ అవసరాలకు ఉపయోగపడే ఎయిర్‌క్రాఫ్ట్‌లు 500కు పైగా కావాల్సి ఉందని, రాబోయే 15 ఏళ్లలో ఈ మార్కెట్ పరిమాణం రూ. 35,000 కోట్ల పైగా ఉండగలదని అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.