న్యూఢిల్లీ: రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్‌బీఎల్) తాజాగా దేశీ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాతో చేతులు కలిపింది. ఏకే–ఓకే ఫ్యాషన్ బ్రాండ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఈ జాయింట్ వెంచర్‌లో ఆర్‌బీఎల్‌కు 60 శాతం అనామికా ఖన్నాకు 40 శాతం వాటాలు ఉంటాయి. ఏకే–ఓకే బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టరుగా అనామిక కొనసాగుతారు. 2007లో ఆర్‌బీఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం అర్మానీ ఎక్సే్చంజ్, బ్రూక్స్ బ్రదర్స్, బర్బరీ, కెనాలీ, డీజిల్ తదితర బ్రాండ్స్‌తో భాగస్వామ్యాలు ఉన్నాయి. దేశీయంగా ఫ్యాషన్ దిగ్గజాలు మనీష్ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్ బ్రాండ్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. 680 స్టోర్లు, 916 షాప్–ఇన్–షాప్స్ ద్వారా విక్రయాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment