anamika khanna
-
అదిరే హెచ్ అండ్ ఎం లిమిటెడ్ ఫ్యాషన్ కలెక్షన్ (ఫొటోలు)
-
అనామికా ఖన్నాతో రిలయన్స్ బ్రాండ్స్ జట్టు
న్యూఢిల్లీ: రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్బీఎల్) తాజాగా దేశీ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాతో చేతులు కలిపింది. ఏకే–ఓకే ఫ్యాషన్ బ్రాండ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఈ జాయింట్ వెంచర్లో ఆర్‌బీఎల్‌కు 60 శాతం అనామికా ఖన్నాకు 40 శాతం వాటాలు ఉంటాయి. ఏకే–ఓకే బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టరుగా అనామిక కొనసాగుతారు. 2007లో ఆర్బీఎల్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం అర్మానీ ఎక్సే్చంజ్, బ్రూక్స్ బ్రదర్స్, బర్బరీ, కెనాలీ, డీజిల్ తదితర బ్రాండ్స్‌తో భాగస్వామ్యాలు ఉన్నాయి. దేశీయంగా ఫ్యాషన్ దిగ్గజాలు మనీష్ మల్హోత్రా, రాఘవేంద్ర రాథోడ్ బ్రాండ్స్‌లో కూడా పెట్టుబడులు ఉన్నాయి. 680 స్టోర్లు, 916 షాప్–ఇన్–షాప్స్ ద్వారా విక్రయాలు సాగిస్తోంది. -
Anamika Khanna: నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగింది.. ఇప్పుడు టాప్ హీరోయిన్లకు
పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్‌లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక. Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది. అలా మొదలైంది.. డ్యాన్స్‌తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్‌షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది. అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్‌లు గీసేది. ఇలా గీసిన స్కెచ్లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్‌లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్‌గా తొలిగుర్తింపు లభించింది. దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్‌లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది. అంతర్జాతీయంగా అనా–మిక.. ‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్‌కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు. ఏకే– ఓకే వర్క్‌షాపులు, లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, పారిస్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్‌తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్‌తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్‌లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు. చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు? View this post on Instagram A post shared by Anamika Khanna (@anamikakhanna.in) -
కాజల్ వెడ్డింగ్ లెహెంగా తయారీకి 30 రోజులు
ముంబై: టాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూలు మూడు మూళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అక్టోబర్ 30న వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ పెళ్లి ఫొటోలు, పెళ్లి వేడుకలపై సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కాజల్ పెళ్లి రోజు ధరించిన లెహెంగాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లిలో ధరించిన గులాబీ రంగు లెహంగాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ లెహెంగా తయారు చేయడానికి 30 రోజుల సమయంలో పట్టిందని ఆమె తెలిపారు. (చదవండి: హనీమూన్ వాయిదా వేసుకున్న కాజల్..) View this post on Instagram @kajalaggarwalofficial in an Anamika Khanna lehenga. Kajal’s lehnga is a labour of love. An intricate zardosi embroidered floral pattern that took 20 people almost a month to create. Styled by @stylebyami #anamikakhanna #kajalagarwal #kajalaggarwal A post shared by Anamika Khanna (@anamikakhanna.in) on Nov 1, 2020 at 7:23am PST కాజల్ తన పెళ్లిలో బంగారు ఆభరాలతో, గులాబి రంగు లెహెంగాలో మెరిసిపోయింది. వివాహ వేడుకు సిద్ధం అవుతూనే వెడ్డింగ్ లెహెంగాను వ్రేలాడతీసి ఉన్న ఫొటోను కాజల్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ లెహెంగాను పూర్తిగా ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీతో తయారు చేశామని, ఆమె ధరించిన భారీ ఆభరణాలను సునీతా షెకావత్ స్వయంగా చేతితో తయారు చేసినట్లు వెల్లడించారు. కాజల్‌పై తమకెంతో అభిమానం ఉందని ఆ అభిమానంతోనే తన పెళ్లి డ్రెస్ ప్రత్యేకంగా ఉండేలా శ్రమించామన్నారు. చందమామ కోసం లెహంగాను అందంగా తీర్చిదిద్దినట్లు అనామికా చెప్పుకొచ్చారు. (చదవండి: కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్...) -
ఫ్యాషన్‌కే గురువు
విజయం కొందరు నేర్పితే నేర్చుకుంటారు. కానీ కొందరికి ఎవరూ ఏదీ నేర్పాల్సిన పని లేదు. వాళ్లకి వాళ్లే గురువులు. వాళ్లకి వాళ్లే మార్గదర్శకులు. అనామిక ఖన్నా కూడా అంతే. ఆమెకి గురువులెవరూ లేరు. కానీ ఇప్పుడు ఎందరికో ఆమే గురువు అయ్యింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో ముందుకు దూసుకుపోతోంది. ఏదైనా చేయాలన్న తపన మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది. ఏదో ఒకటి సాధించాలన్న కసి, దేనినైనా సాధ్యమయ్యేలా చేస్తుంది. అందుకే ఏకలవ్యుడు అంత గొప్ప విలుకాడు అయ్యాడు. అనామిక ఖన్నా ప్రపంచ ప్రఖ్యాతి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. కోల్‌కతాలో, 1977లో పుట్టింది అనామిక. ఊహ తెలియగానే ఆమెకు కళలతో పరిచయం అయ్యింది. తల్లి, ఇద్దరు అక్కలు కూడా చిత్రకారిణులే. దాంతో చిన్న వయసులోనే కుంచె పట్టింది అనామిక. ఆ రంగులు ఆమెను ఏవేవో లోకాల్లోకి తీసుకెళ్లేవి. ఆ చిత్రాలు ఆమెకు ఏవో చిత్రమైన ఆలోచనలు రేకెత్తించేవి. రంగుల కలబోతలో కొత్త కొత్త ప్రయోగాలు చేసేది. అరె, ఈ రంగులో నాకో డ్రెస్ ఉంటే బాగుండేదే అనుకునేది. వెంటనే కాగితమ్మీద ఓ అందమైన అమ్మాయి బొమ్మ సిద్ధం. దానికి తనకు నచ్చిన డ్రెస్ వేసింది. రంగులు అద్దేది. చూసుకుని మురిసిపోయింది. ఇరవయ్యేళ్ల తరువాత వాటిని చూసి ప్రపంచమే మురిసిపోతుందని ఆమెకు తెలీదు. అసలు తాను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ అన్న విషయమే అప్పటికామెకు తెలీదు. మరీ డబ్బున్న కుటుంబమేమీ కాదు అనామికది. అలా అని కష్టాలు పడుతూ కూడా పెరగలేదు. అయితే ఆడపిల్లలకు ఉండే అన్ని హద్దులూ ఉన్నాయి. అదృష్టంకొద్దీ ఆమె ఆశకు ఏదీ అవరోధం కాలేదు. అసలు తనకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉందన్న విషయమే అనామిక ఎవరికీ చెప్పలేదు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోవాలని కూడా అనుకోలేదు. తనకు తానుగా కొత్త కొత్త డిజైన్లను కాగితాల మీద సృష్టించేది. తాను కొత్త బట్టలు తీసుకున్నప్పుడల్లా, తన డ్రెస్ తానే డిజైన్ చేసి కుట్టించుకునేది. వాటిని చూసినవాళ్లు ‘భలే ఉందే’ అంటే చాలు... అంతర్జాతీయ డిజైనర్ అయిపోయినంత సంబరపడిపోయేది. మౌత్ పబ్లిసిటీని మించినదేదీ లేదు కదా! ఒక్కసారి ఒక విషయం గురించి తెలిస్తే... అది మాటల్లో మెల్లమెల్లగా పాకి, అందరికీ తెలిసిపోతుంది. అనామిక దుస్తుల డిజైనింగ్ గురించి కూడా అందరికీ తెలిసిపోయింది. చాలామంది ఆమె దగ్గర సలహాలు తీసుకునేవారు. తమకు ఒక్క డ్రెస్ డిజైన్ చేసి పెట్టమని ఆమె దగ్గరకు వస్తూండేవారు. దాంతో తనమీద తనకు నమ్మకం పెరిగింది అనామికకి. తన చేతిజోరును పెంచింది. కుంచెకు మరింత పని చెప్పింది. రంగులతో ఆడుకోవడం మొదలుపెట్టింది. విజయం వైపు పయనం... లక్ష్యం ఎంత బలమైనదైతే, దాన్ని సాధించడం అంత కష్టమవుతుంది. కాకపోతే కృషి చేసే సత్తా ఉన్నవారికి, కష్టాన్ని ఇష్టంగా స్వీకరించేవారికి అది పెద్ద పని కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న తనప అనామికతో అడుగులు వడివడిగా వేసింది. కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ని పెట్టడంతో ఆమె ప్రయాణం మొదలైంది. అయితే గమ్యాన్ని చేరేందుకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. వారానికో డ్రెస్సు కూడా అమ్ముడవని రోజులు ఉన్నాయి. తన కలెక్షన్స్‌ను జనానికి చేరువ చేయడానికి ఆమెకు చాలా కాలమే పట్టింది. చివరికి విజయం సాధించింది. తన డిజైన్స్‌కు ప్రాచుర్యం పెరగ్గానే ఆమె ఫ్యాషన్‌కి ఆలవాలమైన ముంబైపై దృష్టి పెట్టింది. భారతీయ సంప్రదాయ వస్త్రాల డిజైన్లకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి అనామిక తయారుచేసే దుస్తులు సెలెబ్రిటీలను ఆకర్షించాయి. సోనమ్‌కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్ లాంటి వాళ్లంతా ఆమె దుస్తుల్లో దేవకన్యల్లా వెలిగిపోసాగారు. దాంతో అనామిక పేరు దేశమంతా తెలిసిపోయింది. ఆపైన ప్రముఖ డిజైనర్ మనీష్ అరోరాతో కలిసి ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి వెళ్లింది అనామిక. తన సత్తా ఏమిలో విదేశీయులకీ చూపించింది. తన బ్రాండ్ నేమ్‌ని పలు దేశాల్లో విస్తరింపజేసి, తిరుగు లేని ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రశంసలు కొట్టేస్తోంది. - ప్రకాష్ చిమ్మల