కాజల్‌ వెడ్డింగ్‌ లెహెంగా తయారీకి 30 రోజులు | Designer Anamika Khanna Shares About Kajal Aggarwal Wedding Lehenga | Sakshi
Sakshi News home page

కాజల్‌ వెడ్డింగ్‌ లెహెంగా.. 20 మంది 30 రోజులు..

Published Mon, Nov 2 2020 4:58 PM | Last Updated on Mon, Nov 2 2020 5:20 PM

Designer Anamika Khanna Shares About Kajal Aggarwal Wedding Lehenga - Sakshi

ముంబై: టాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కాజల్‌ అగర్వాల్‌-గౌతమ్‌ కిచ్లూలు మూడు మూళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అక్టోబర్‌ 30న వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్‌ పెళ్లి ఫొటోలు, పెళ్లి వేడుకలపై సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా కాజల్‌ పెళ్లి రోజు ధరించిన లెహెంగాకు సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లిలో ధరించిన గులాబీ రంగు లెహంగాను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అనామిక ఖన్నా డిజైన్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ లెహెంగా తయారు చేయడానికి 30 రోజుల సమయంలో పట్టిందని ఆమె తెలిపారు. (చదవండి: హనీమూన్‌ వాయిదా వేసుకున్న కాజల్‌..)

కాజల్‌ తన పెళ్లిలో బంగారు ఆభరాలతో, గులాబి రంగు లెహెంగాలో మెరిసిపోయింది. వివాహ వేడుకు సిద్ధం అవుతూనే వెడ్డింగ్‌ లెహెంగాను వ్రేలాడతీసి ఉన్న ఫొటోను కాజల్ ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ లెహెంగాను పూర్తిగా ఫ్లోరల్‌ డిజైన్‌ ఎంబ్రాయిడరీతో తయారు చేశామని, ఆమె ధరించిన భారీ ఆభరణాలను సునీతా షెకావత్‌ స్వయంగా చేతితో తయారు చేసినట్లు వెల్లడించారు. కాజల్‌పై తమకెంతో అభిమానం ఉందని ఆ అభిమానంతోనే తన పెళ్లి డ్రెస్‌ ప్రత్యేకంగా ఉండేలా శ్రమించామన్నారు. చందమామ కోసం లెహంగాను అందంగా తీర్చిదిద్దినట్లు అనామికా చెప్పుకొచ్చారు. (చదవండి: కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement