న్యూఢిల్లీ: జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఈ20 పెట్రోల్ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ముడిచమురు దిగుమతులను అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.
ఈ20 పెట్రోల్‌కు అనుగుణంగా ఉండే వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడవచ్చని జియో–బీపీ పేర్కొంది. ఇంధనాల విక్రయం కోసం దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి రిలయన్స్ బీపీ మొబిలిటీ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇది జియో–బీపీ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ జేవీకి దేశవ్యాప్తంగా 1,510 ఎనర్జీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్, రిఫ్రెష్‌మెంట్లు వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment