
ఫాక్స్‌కాన్‌తో అదాని జాయింట్ వెంచర్?
న్యూఢిల్లీ: అదాని ఎంటర్‌ప్రైజెస్, ప్రపంచ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో కలసి ఒక జాయిం ట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా అదాని ఎంటర్‌ప్రైజెస్ భారత్‌లో యాపిల్ ఐఫోన్స్‌ను తయారు చేస్తుందని సమాచారం. కంపెనీ వ్యాపార విస్తరణ కోసం గత నెలలో అదాని షేర్‌హోల్డర్లు సెక్యూరిటీల ఇష్యూ ద్వారా రూ.6,000 కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేరు ధర బీఎస్‌ఈలో 11 శాతం పెరిగి రూ.94 వద్ద ముగిసింది.