![Interglobe and UPS set up logistics firm offering B2B services in India - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/27/UPS.jpg.webp?itok=68RnF6x4)
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణమైన లాజిస్టిక్స్ సర్వీసులను అందించే దిశగా అమెరికాకు చెందిన యూపీఎస్‌తో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ జట్టు కట్టింది. ఇందుకోసం మొవిన్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోని వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా బీ2బీ లాజిస్టిక్స్ సేవలను మొవిన్ అందించనుంది.
దేశీయంగా బీ2బీ విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోనున్నామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ జేబీ సింగ్ తెలిపారు. జేవీ సంస్థ గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తోందని .. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు కూడా ప్రారంభించిందని వివరించారు. 220 పైగా దేశాలు, ప్రాంతాల్లో యూపీఎస్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ .. ఏవియేషన్ (ఇండిగో ఎయిర్‌లైన్స్), ఆతిథ్య తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment