కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొత్తగా వేల్యూ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఉండాల్సిన విలువ కన్నా తక్కువ ధరకు ట్రేడవుతున్న నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. సముచిత స్థాయిలో పెట్టుబడులకు భద్రత కలిపిస్తూ, రిస్కు భారం తక్కువగా ఉండే స్టాక్స్‌కు ప్రాధాన్యం లభిస్తుందని సేల్స్, మార్కెటింగ్ హెడ్ మోహిత్ భాటియా తెలిపారు. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఈక్విటీలకు అధిక కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. కెనరా రోబెకో వేల్యూ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో ఆగస్టు 27న ముగుస్తుంది. తిరిగి క్రయ, విక్రయాలకు సెప్టెంబర్ 6న అందు బాటులోకి వస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment