
యూటీఐ మ్యుచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్‌ను ( Quant Fund ) ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్‌ఎఫ్‌వో ( New Fund Offer ) జనవరి 2న ప్రారంభమై 16న ముగుస్తుంది.
యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్‌మార్క్‌లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్‌గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.
విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్‌కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్‌వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.
“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన, పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్‌తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.