ఏ దేశంలో అయినా సరే పరిమితికి మంచి ఆదాయం ఉంటే కచ్చితంగా పన్ను కట్టాల్సిందే. దీనికి ఎవరూ అతీతులు కాదు. ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకు తిరిగేవారిపై కొన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటాయి. ముఖ్యంగా చైనా దేశం అయితే పన్ను ఎగవేతదారులపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా పరిమితికి మించి ఆదాయం ఉంటే పన్ను కట్టాల్సిందే. లేదంటే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా టాక్స్ ఎగవేసిన ఓ నటికి భారీ జరిమానా విధించి షాకిచ్చారు చైనా ఆదాయ శాఖ అధికారులు. పన్ను ఎగవేతపై చైనా నటి జెంగ్ షువాంగ్ 330 కోట్లు(46 మిలియన్ డాలర్లు) కట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి: పీకల్లోతు కష్టాల్లోకి బాలీవుడ్.. నార్త్ ఆడియెన్స్ కు ఏమైంది?)
30 ఏళ్ల జెంగ్ షువాంగ్ ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌ల కోసం తీసుకున్న పేమెంట్‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. దీంతో పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. అంతేకాదు ఆమె పాల్గొన్న షోల ప్రసారాన్ని నిషేదించింది. ఆమె మాజీ భర్త జెంగ్ హెంగ్ సమాచారం మేరకు మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైనాలో ప్రజల మధ్య ధనిక, పేద ప్రజల మధ్య తేడాలను తగ్గించేందుకు ఆ దేశం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం సెలబ్రిటీలపై అక్కడి సర్కారు నిఘా పెరిగింది. పన్ను ఎగవేస్తున్న వాళ్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment