
న్యూఢిల్లీ: అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలకు భరోసా కల్పించే చర్యలపై అదానీ గ్రూప్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని గ్రూప్ కంపెనీల ఖాతాలను స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకుంది. తాము ఏమీ దాచడం లేదని, చట్టాలన్నింటినీ పాటిస్తున్నామని నియంత్రణ సంస్థలకు తెలియజేయడమే ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్థిక సంస్థలపై ప్రభావం నిల్: ఎస్‌అండ్‌పీ
అదానీ గ్రూప్ సంక్షోభ ప్రభావాలు ఇతర ఆర్థిక సంస్థలపై భారీగా ఉండబోవని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింVŠ ఒక నివేదికలో విశ్లేషించింది.