యూఎస్ రీసెర్చ్ సంస్థ బెర్న్‌స్టీన్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రమోటర్ల షేర్ల తనఖా తగ్గడంతోపాటు.. లెవరేజ్ కనిష్టస్థాయికి చేరినట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. గత రెండేళ్ల కాలంలో గ్రూప్ లెవరేజ్, షేర్ల తనఖా, రుణ చెల్లింపులు, బిజినెస్ విలువలు తదితరాల విశ్లేషణతో నివేదికను విడుదల చేసింది.
కాగా.. 2023 జనవరిలో అదానీ ఖాతాలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన కారణంగా గ్రూప్ కంపెనీలోని పలు షేర్లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. తదుపరి అదానీ గ్రూప్ వీటిని ఆధార రహితాలుగా కొట్టిపారేసింది. దీంతో తిరిగి గ్రూప్ కంపెనీలు బలపడటంతోపాటు నిధులను సైతం సమీకరించగలిగాయి.
ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే రిసు్కలు తగ్గినట్లు బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది. కాగా.. గత నెల 21న యూఎస్ అధికారికవర్గాలు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సంబంధిత ఉన్నతాఅధికారులపై లంచాల ఆరోపణలు చేసింది. వీటిని సైతం అదానీ గ్రూప్ తోసిపుచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment