independent company
-
ఆరు సంస్థలుగా వేదాంతా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన రుణదాత ఎస్బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి -
అదానీ గ్రూప్ కంపెనీల ఆడిటింగ్
న్యూఢిల్లీ: అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలకు భరోసా కల్పించే చర్యలపై అదానీ గ్రూప్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని గ్రూప్ కంపెనీల ఖాతాలను స్వతంత్ర సంస్థతో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్‌టన్‌ను నియమించుకుంది. తాము ఏమీ దాచడం లేదని, చట్టాలన్నింటినీ పాటిస్తున్నామని నియంత్రణ సంస్థలకు తెలియజేయడమే ఈ ఆడిట్ ప్రధాన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంస్థలపై ప్రభావం నిల్: ఎస్అండ్పీ అదానీ గ్రూప్ సంక్షోభ ప్రభావాలు ఇతర ఆర్థిక సంస్థలపై భారీగా ఉండబోవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింVŠ ఒక నివేదికలో విశ్లేషించింది. -
స్వతంత్ర సంస్థకు రుణ నిర్వహణా బాధ్యతలు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రభుత్వ రుణ నిర్వహణ బాధ్యతలను క్రమంగా తొలగించి, ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియను ఆర్థికశాఖ ప్రారంభించింది. ప్రత్యేకంగా ప్రభుత్వ రుణ నిర్వహణా సంస్థ(పీడీఎంఏ) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా ఆర్థికమంత్రిత్వశాఖలో రుణ బడ్జెట్ నిర్వహణ విభాగం (పీడీఎంసీ) ఏర్పాటయినట్లు ఒక సర్క్యులర్‌లో తెలిపింది. రెండేళ్లలో ఇది పూర్తి చట్టబద్ద సంస్థ (పీడీఎంఏ)గా రూపాం తరం చెందుతుంది.