న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్‌బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.
అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రధాన రుణదాత ఎస్‌బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్‌బీఐ, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి.
విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి
Comments
Please login to add a commentAdd a comment