demerged
-
ఆరు సంస్థలుగా వేదాంతా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీతకు రుణదాతలు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆరు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా ఆవిర్భవించేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. ఎస్బీఐసహా రుణదాతలు అంగీకరించడంతో 52 శాతానికిపైగా అను మతి లభించినట్లేనని వేదాంతా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. అధిక శాతం రుణదాతలు విడదీతను సమరి్ధంచినట్లు వెల్లడించారు. విడదీత ప్రణాళికకు 75% ఆమోదం లభించవలసి ఉండగా.. వారం, పది రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని సైతం చేరుకోగలమని తెలియజేశారు. కొన్ని అనుమతులకు కమిటీ మీటింగ్, బోర్డు సమావేశాల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. వీటి తదుపరి ఎన్సీఎల్టీకి దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన రుణదాత ఎస్బీఐ ఇప్పటికే సమ్మతించగా.. 20 బిలియన్ డాలర్ల విలువైన విడదీత ప్రణాళికకు దారి ఏర్పడినట్లు వివరించారు. గత జనవరి–మార్చిలో రూ. 6,155 కోట్ల నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో రుణ భారం రూ. 56,388 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వేదాంతా రుణదాతల జాబితాలో ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఐవోబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతోపాటు.. ప్రయివేట్ బ్యాంకులైన యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. విడదీతలో భాగంగా వేదాంతా.. అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, బేస్ మెటల్స్ సంస్థలుగా ఏర్పాటు కానుంది. ఇవన్నీ స్వతంత్ర కంపెనీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి -
ఆరు కంపెనీలుగా వేదాంతా
బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్.. వేదాంతా రిసోర్సెస్.. సరికొత్త ప్రణాళికలకు తెరతీసింది. వీటి ప్రకారం డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఆరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఇక మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ విభిన్న విభాగాల కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. తద్వారా ఓవైపు రుణ భారాన్ని తగ్గించుకోవడం, మరోపక్క వాటాదారులకు అధిక విలువను రాబట్టడం లక్ష్యాలుగా పెట్టుకుంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ కీలక బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనుంది. అల్యూమినియం, ఆయిల్– గ్యాస్, స్టీల్, ఫెర్రస్ మెటల్స్, బేస్ మెటల్స్ పేరుతో ఐదు విభాగాలను విడదీసేందుకు ప్రణాళికలు వేసింది. వీటిని విడిగా లిస్ట్ చేయడం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చనున్నట్లు వేదాంతా తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా సరళతర విభజనకు తెరతీయనుంది. వెరసి వేదాంతా వాటాదారులకు తమవద్దగల ప్రతీ 1 షేరుకీ విడదీయనున్న 5 కంపెనీలకు చెందిన ఒక్కో షేరు చొప్పున కేటాయించనున్నారు. ఆపై వీటిని స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్ట్ చేయనున్నట్లు వేదాంతా తెలియజేసింది. వెరసి వేదాంతాసహా.. ఆరు లిస్టెడ్ కంపెనీలకు తెరలేవనుంది. ఇక మరోవైపు హిందుస్తాన్ జింక్‌సహా.. కొత్తగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్, సెమీకండక్టర్ డిస్ప్లే బిజినెస్‌లలో 65 శాతం చొప్పున వాటాను కలిగి ఉండనుంది. ఈ మొత్తం ప్రణాళికల అమలును 12–15 నెలలలోగా పూర్తిచేయాలని వేదాంతా భావిస్తోంది. గ్రూప్‌నకు మాతృ సంస్థ వేదాంతా రిసోర్సెస్.. హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. హింద్ జింక్ కార్పొరేట్ సమీక్ష వేదాంతా గ్రూప్ కంపెనీ హిందుస్తాన్ జింక్ పూర్తిస్థాయిలో కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించనుంది. కంపెనీ విలువలో మరింత వృద్ధికి వీలుండటంతో కార్పొరేట్ నిర్మాణ సమీక్షకు బోర్డు నిర్ణయించినట్లు మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ వెల్లడించింది. ప్రధానంగా జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల భిన్న విభాగాల పరిమాణం, కార్యకలాపాలు, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనలకు తెరతీసినట్లు వివరించింది. వీటిలో బిజినెస్ అవసరాలరీత్యా మూలధన నిర్మాణం, పెట్టుబడి కేటాయింపుల విధానాలు, కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి తదితర అంశాలున్నట్లు తెలియజేసింది. తద్వారా విభిన్న బిజినెస్‌లు తమ మార్కెట్ పొజిషన్‌ను వినియోగించుకుని దీర్ఘకాలిక వృద్ధి సాధించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేసింది. వెరసి అన్ని రకాల వాటాదారులకు విలువ చేకూర్చే వ్యూహంతో ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్‌ల విడదీత వార్తలతో ఎన్ఎస్ఈలో వేదాంతా షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 223 వద్ద నిలవగా.. హిందుస్తాన్ జింక్ 3.5 శాతం జంప్‌చేసి రూ. 308 వద్ద ముగిసింది. నిధుల సమీకరణ.. ప్రతీ ప్రత్యేక విభాగాన్నీ ఒక్కొక్క కంపెనీగా విడదీయడం ద్వారా వేదాంతా గ్రూప్ కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరంగా మార్చివేయనుంది. ఆయా రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే బాటలో స్వతంత్ర సంస్థలుగా ఏర్పాటు చేయనుంది. దీంతో సావరిన్ వెల్త్‌ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లతోపాటు.. సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలను కలి్పంచే యోచనలో ఉంది. వెరసి దేశ ఆర్థిక వృద్ధిని అవకాశాలుగా మలచుకునే ప్యూర్‌ప్లే కంపెనీలలో పెట్టుబడులకు వ్యూహాత్మక ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న భారత్‌లో కమోడిటీలకు భారీ డిమాండ్ కనిపించనున్నట్లు వేదాంతా భావిస్తోంది. ఇటీవలే సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీలోకి సైతం ప్రవేశించింది. -
ఫోర్బ్స్ టూల్స్ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ప్రెసిషన్ టూల్స్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఫోర్బ్స్ అండ్ కంపెనీ(ఎఫ్‌సీఎల్) తాజాగా వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రెసిషన్ టూల్స్ అండ్ మెషీన్ పార్ట్స్ లిమిటెడ్(ఎఫ్‌పీటీఎల్) పేరుతో కొత్త కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎఫ్‌సీఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకి మరో ఎఫ్‌పీటీఎల్ షేరుని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిని బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. గతేడాది(2021–22) ఈ విభాగం రూ. 179 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలియజేసింది. సంబంధిత విభాగంపై మరింత దృష్టి సారించడంతోపాటు వాటాదారులకు విలువ చేకూర్చే బాటలో తాజా ప్రణాళికకు తెరతీసినట్లు వివరించింది. కాగా.. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, కోడింగ్ మెడికల్ పరికరాలు, విడిభాగాలు, అప్లికేషన్లు, వెంటిలేటర్లు, రియల్టీ తదితర వివిధ బిజినెస్‌లను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
పుట్టపర్తి టీడీపీలో ముదిరిన విభేదాలు
బుక్కపట్నం : కొన్నాళ్లుగా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరి పాకానా పడ్డాయి. నగర పంచాయతీ చైర్మన్‌గా పదవీ కాలం ఒప్పందం ప్రకారం పూర్తయినా పీసీ గంగన్న పదవి నుంచి దిగిపోకపోవటంతో ప్రత్యర్థులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అండతో గంగన్నపై వేటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గతంలో అనేకసార్లు అధిష్టానం ముందు పంచాయితీ జరిగినా పదవి నుంచి దిగేందుకు గంగన్న ససేమీరా అనటంతో ప్రత్యర్థులు ఈ సారి ఏకంగా అమరావతిలోనే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్‌ను నేరుగా కలసి అప్పట్లో ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ పత్రాలు సమర్పించారు. ఒప్పందం ప్రకారం గంగన్న రెండున్నరేళ్లు బెస్త చలపతి రెండున్నరేళ్లు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని గంగన్న ఉల్లంఘించాడని బెస్త చలపతి వర్గం గట్టిగా వినిపించింది. ఒక వేళ పీసీ పదవి నుంచి దిగక పోతే పార్టీ నుంచి బహిష్కరించి సాగనంపేలా పావులు కదిపారు. ఈ సారీ ఎలాగైనా గంగన్నను చైర్మన్ పదవి నుంచి దింపేందుకు మాజీ మంత్రి పల్లె గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గంగన్న పదవికి రాజీనామా చేస్తాడా లేక ఎదురు తిరుగుతాడా అనే విషయం రానున్న అతి కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే గంగన్న పార్టీలో ఉంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీలో ఉన్న విభేదాల వల్ల నగర పంచాయతీ అభివృద్ధి కుంటు పడిందని పలువురు పేర్కొంటున్నారు.