స్వతంత్ర సంస్థకు రుణ నిర్వహణా బాధ్యతలు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ప్రభుత్వ రుణ నిర్వహణ బాధ్యతలను క్రమంగా తొలగించి, ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియను ఆర్థికశాఖ ప్రారంభించింది. ప్రత్యేకంగా ప్రభుత్వ రుణ నిర్వహణా సంస్థ(పీడీఎంఏ) ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా ఆర్థికమంత్రిత్వశాఖలో రుణ బడ్జెట్ నిర్వహణ విభాగం (పీడీఎంసీ) ఏర్పాటయినట్లు ఒక సర్క్యులర్‌లో తెలిపింది. రెండేళ్లలో ఇది పూర్తి చట్టబద్ద సంస్థ (పీడీఎంఏ)గా రూపాం తరం చెందుతుంది.