సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం 25 సంవత్సరాల ఆడిట్ నుంచి మినహాయించాలని కోరుతూ శ్రీ పద్మనాభస్వామి ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆదేశించిన ఆడిట్ కేవలం దేవాలయానికి మాత్రమే పరిమితం కాదని, ట్రస్ట్ కూడా వర్తింస్తుందని స్పష్టం చేసింది. ఆడిట్ మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక ఆడిట్ నుంచి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ని విచారించింది. మూడు నెలల్లోగా ఆడిట్ పూర్తి కావాలని స్పష్టం చేసింది. అలానే ఆడిట్ అనేది కేవలం ఆలయానికి సంబంధించి మాత్రమే కాక ట్రస్ట్ కూడా వర్తిస్తుందని తెలిపింది. 2015 నాటి ఆర్డర్‌లో నమోదైన కేసులోని అమికస్ క్యూరీ నివేదికల నేపథ్యంలో ఈ చర్యను చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.
(చదవండి: చదువుపై దృష్టి పెట్టు: ఇంటర్ విద్యార్ధికి సుప్రీం సూచన )
రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.
చదవండి: ఇదేం పద్ధతి?
Comments
Please login to add a commentAdd a comment