padmanabhaswamy temple
-
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్‌ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బుధవారం తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షోర్ చేశాడు. అదే విధంగా తన అభిమానులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు. కాగా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా 32 ఏళ్ల కేశవ్ మహరాజ్ భారత మూలాలు కలిగి ఉన్నాడు. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కాగా అతడి కుటంబం తన చిన్నతనంలోనే సౌతాఫ్రికాలో స్థిరపడింది. కాగా 2016లో ప్రోటీస్ జట్టు తరపున మహరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. IND vs SA: South African spinner Keshav Maharaj visits Sri Padmanabha Mandir in Trivandrum, dons traditional attire -Check Out Read more:https://t.co/aM0V43W0ON#INDvsSA #KeshavMaharaj — InsideSport (@InsideSportIND) September 27, 2022 చదవండి: T20 WC 2022: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్ -
పద్మనాభ స్వామి ఆలయం: 3 నెలల్లోగా ఆడిట్ పూర్తి చేయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం 25 సంవత్సరాల ఆడిట్ నుంచి మినహాయించాలని కోరుతూ శ్రీ పద్మనాభస్వామి ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు గత సంవత్సరం ఆదేశించిన ఆడిట్ కేవలం దేవాలయానికి మాత్రమే పరిమితం కాదని, ట్రస్ట్ కూడా వర్తింస్తుందని స్పష్టం చేసింది. ఆడిట్ మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక ఆడిట్ నుంచి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ని విచారించింది. మూడు నెలల్లోగా ఆడిట్ పూర్తి కావాలని స్పష్టం చేసింది. అలానే ఆడిట్ అనేది కేవలం ఆలయానికి సంబంధించి మాత్రమే కాక ట్రస్ట్ కూడా వర్తిస్తుందని తెలిపింది. 2015 నాటి ఆర్డర్లో నమోదైన కేసులోని అమికస్ క్యూరీ నివేదికల నేపథ్యంలో ఈ చర్యను చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: చదువుపై దృష్టి పెట్టు: ఇంటర్ విద్యార్ధికి సుప్రీం సూచన ) రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. చదవండి: ఇదేం పద్ధతి? -
ఆర్థిక ఇబ్బందుల్లో పద్మనాభ దేవాలయం
న్యూఢిల్లీ: ప్రసిద్ధిగాంచిన పద్మనాభ స్వామి దేవాలయం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని, స్వామికి వచ్చే కానుకలు నిర్వహణా వ్యయాలకు చాలడం లేదని గుడి నిర్వహణా కమిటీ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ట్రావెన్కోర్ రాజ కుటుంబం నడిపే దేవస్థాన ట్రస్టుపై ఆడిట్ నిర్వహించాలని కోరింది. కేరళలోని ఈ ప్రఖ్యాత దేవాలయం నిర్వహణకు నెలకు రూ.1.25 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే తమకు గరిష్టంగా 60-70 లక్షల రూపాయలే వస్తున్నాయని, ఈ విషయమై తగు సూచనలివ్వాలని కమిటీ తరఫు న్యాయవాది బసంత్ కోర్టును అభ్యర్థించారు. సొమ్ములు లేకపోవడంతో నిర్వహణ క్లిష్టంగా మారిందని, నిధులపై వివరాలు తెలుసుకుందామని ఆడిట్ కోసం కోరితే ట్రస్టు స్పందించడంలేదని తెలిపారు. టస్ట్రు వద్ద రూ.2.87 కోట్ల నగదు, 1.95 కోట్ల ఆస్తులు ఉన్నట్లు 2013 ఆడిట్ నివేదిక తెలియజేస్తోందని, ఇప్పుడు ట్రస్టు వద్ద ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆడిట్ జరపాలని కోరారు. గతంలో సుప్రీం ఆదేశాల మేరకే ట్రస్టు ఏర్పడిందని, దేవస్థానానికి ట్రస్టు తప్పక సాయం చేయాలనే విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు.. రాజకుటుంబ ట్రస్టు పద్మనాభస్వామి ట్రస్టు రాజకుటుంబం ఏర్పరిచిన పబ్లిక్ ట్రస్టని, దానికి ఆలయ నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదని ట్రస్టు తరఫు న్యాయవాది అరవింద్ వాదించారు. గుళ్లో పూజలు, ఆచారాలను పర్యవేక్షించడానికి ట్రస్టు పరిమితమని, సుప్రీంకోర్టు అమికస్ క్యూరి కోరినందునే గతంలో ఆడిట్ జరిగిందని చెప్పారు. గుడికి, ట్రస్టుకు సంబంధం లేనందున ఆడిట్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తమది స్వతంత్ర కమిటీ అని, ట్రస్టుపై కమిటీ ఆధిపత్యానికి అంగీకరించమని తెలిపారు. సంవత్సరాలుగా కమిటీ, ట్రస్టు మధ్య వివాదం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేవస్థానం రోజూవారీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ఈ విషయంలో సంబంధిత అథారీ్టలను సంప్రదించాలని సూచించింది. ఆడిట్ నుంచి మినహాయించాలన్న ట్రస్టు అభ్యర్ధనపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 2011లో గుడికి స్వతంత్ర ట్రస్టును ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పరచాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసి, రాజ కుటుంబానికి గుడి నిర్వహణపై హక్కును పునరుద్ధరించింది. అనంతరం గుడికి సంబంధించి 25ఏళ్ల ఆదాయవ్యయాలను ఆడిట్ చేయాలని నిర్వహణ కమిటీకి సూచించింది. అయితే ఆడిట్‌కు ట్రస్టు ఆంగీకరించడంలేదు. దీంతో 9ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాన్ని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది -
పద్మనాభ స్వామి ఆలయం మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రసిద్ధి చెందిన కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రధాన పూజారి, సంయుక్త ప్రధాన పూజారి సహా మొత్తం పదిమంది ఆలయ పూజారులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడడంతో ఆలయాన్ని అక్టోబర్ 15వ తేదీ వరకు తాత్కాలిక ప్రాతిపదికపై మూసివేశారు. ఇప్పటి వరకు ప్రత్యేక పూజలు మాత్రమే నిర్వహిస్తూ వచ్చిన తంత్రి ఇక రోజువారి పూజలు నిర్వహిస్తారని, రోజు వారి పూజలకు భక్తులను అనుమతించరని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి రథీసన్ తెలియజేశారు. భారత్‌లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 69,06,151 చేరుకుందని, గడచిన 24 గంటల్లో దేశం మొత్తం 70,496 చేరుకుందని, ఇక మొదట్లో కరోనా మృతుల సంఖ్య 964 ఉండగా ఇప్పుడు మరణాల సంఖ్య అనూహ్యంగా కేసుల సంఖ్య లక్షా ఆరువేల నాలుగు వందల తొంభై. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.64 కోట్లకు చేరుకుందని, మరణాల సంఖ్య10, 50, 869 చేరుకుందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వర్గాలు వివరించాయి. కరోనా బారిన పడిన వారిలో దాదాపు 2.53 కోట్లకు చేరుకుందని చెప్పాయి. (వచ్చే నెల్లో కోవిడ్ వ్యాక్సిన్!) -
ఆరో గది తెరిచే నిర్ణయం వారిదే!
తిరువనంతపురం: కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం... చాలా కాలం వరకు అంతగా గుర్తింపు పొందని ఈ ఆలయం 2011లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ గుడిలోని రహస్య తలుపులను తెరవగా అందులో లక్షల కోట్ల విలువైన నిధి నిక్షేపాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ గుడి ఒక్కసారిగా దేశంలోనే అత్యంత విలువైన గుడిగా మారిపోయింది. అయితే ఆ గుడిలో అన్నినేలమాలళిగలను తెరిచిన నిపుణులు ఒక నేలమాళిగను మాత్రం తెరవలేదు. ఆ గదిని తెరవాలని కొందరు, తెరవకూడదని మరికొందరు... ఇలా ఎవరి నమ్మకాలకు అనుకూలంగా వారు వాదించారు. దానికి నాగబంధం ఉండటంతో అది తెరిస్తే ప్రళయం వస్తుందని కొందరు వాదిస్తున్నారు. చదవండి: ఇటాలియన్ మెరైన్స్ కేసు: కీలక పరిణామం అయితే ఆ తలుపు తెరవాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించాలో తెలియలేదు. ఎందుకంటే 1991 లో ట్రావెన్కోర్ చివరి పాలకుడు మరణించిన తరువాత రాజ కుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011 లో తీర్పునిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. అదే విధంగా ఆరవ నేలమాళిగను తెరవాలని కూడా ఆదేశించింది. దీంతో ఆరవ నేలమాళిగలు తెరవడం ఇష్టం లేని ట్రావెన్కోర్ వంశీయులు ఆలయంపై హక్కులు తమకే ఉన్నయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 9 సంవత్సరాల తరువాత ఈ ఉత్తర్వులను కొట్టిపడేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని తెలిపింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. దీంతో ఆరోగది తెరవాలా వద్దా అనేది విషయానికి సంబంధించి ట్రావెన్కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది. చదవండి: శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ -
‘నన్ను కూడా ఆలయంలోకి అనుమతివ్వలేదు’
న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో ఆలయ ప్రవేశాల వివాదం బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. నేటికి కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను కూడా ఆలయంలోకి అనుమతించలేదు అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్. అయితే ఇక్కడ శశి థరూర్‌ని అనుమతించనది అయ్యప్ప ఆలయంలోనికి కాదు.. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి. వివరాలు.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వదేశి దర్శన్’ టూరిజం ప్రాజెక్ట్‌లో భాగంగా ఓ పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించటానికి కేరళకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీతో పాటు శశి థరూర్ మరికొందరు కేరళ నాయకులు కూడా వెళ్లారు. అధికారిక పర్యటన అనంతరం మోదీ ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అయితే అప్పుడు మోదీతో పాటు తనను పద్మనాభ స్వామి ఆలయంలోకి అనుమతించలేంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శశి థరూర్. పీఎమ్‌వో కావాలనే తనతో పాటు మరికొందరి పేర్లను తొలగించిందంటూ.. బీజేపీ కుటిల రాజకీయాలకు ఈ సంఘటన సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు. Received PrimeMinister @narendramodi at the SreePadmanabhaSwamy temple in Thiruvananthapuram for the unveiling of a plaque of the Swadesh Darshan project. But when the local MP,MLA&Mayor were to enter the temple w/him for darshan, we learned that @PMOIndia had cut us from d list. pic.twitter.com/mactAJZZgK — Shashi Tharoor (@ShashiTharoor) January 15, 2019 -
మలయాళ సినిమా మొదలు పెట్టిన రానా
బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న 1945, హాథీమేరి సాథీ సినిమాల్లో నటిస్తున్న రానా.. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకొచ్చాడు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ట్రావెన్ కోర్ రాజు మార్తండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో రాజా మార్తండ వర్మగా నటిస్తున్నాడు రానా. 18వ శతాబ్ధంలో జరిగిన కథతో భారీ చారిత్రక చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె.మధు. ఈ సినిమాకు మార్తండ వర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా 2018లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
చీరలోనే రావాలి.. చుడీదార్‌కు నో ఎంట్రీ..!
తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం కొందరు మహిళా భక్తులు చుడీదార్లు ధరించిన ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అర్చకు, అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. జడ్జి తీర్పును నిరసిస్తూ కొందరు భక్తులు రోడ్డుపై బైఠాయించారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించే మహిళలు చీరలు మాత్రమే ధరించాలని ఏళ్లుగా రాసుకోని కట్టుబడి కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త రియా రాజి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం మంగళవారం తీర్పు చెప్పిన హైకోర్టు.. ‘చుడీదార్లు ధరించి కూడా ఆలయంలోకి వెళ్లొచ్చు’అని స్పష్టం చేసింది. కానీ ఆలయ సిబ్బంది, అర్చకులు, అధికారులు మాత్రం చుడీదార్లు వేసుకుని వచ్చిన మహిళలను లోనికి అనుమతించలేదు. దీనిపై పద్మనాభస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎన్ సతీశ్ మాట్లాడుతూ తమకు జిల్లా జడ్జి ఆలయానికి రాసిన లేఖలో ‘విచక్షణను అనుసరించి’ నిర్ణయం తీసుకోవాలన్నారని, సంబంధిత ఆదేవాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, అందుకే చుడీదార్లలో వచ్చిన మహిళలను లోపలికి అనుమతించలేదని చెప్పారు. మరోవైపు చుడీదార్ మహిళల ప్రయత్నాన్ని నిరసిస్తూ కొందరు భక్తులు ఆందోళకు దిగారు. ఏక వ్యక్తులుగా జడ్జిలు తీసుకునే నిర్ణయాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ను మీడియా ప్రశ్నించగా..‘కాలానుగునంగా చాలా ఆలయాల నియమాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం పద్మనాభస్వామి ఆలయం వద్ద నెలకొన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడతానన’ని చెప్పారు. -
ఈ ఆలయాల సంపదతో.. పేదరికం హుష్‌కాకి!
ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంతో నల్లధన సంపన్నుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నల్లధనాన్ని సక్రమధనంగా మార్చేందుకు పలువురు ధనికులు నానా తంటాలు పడుతుండగా.. మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా గుళ్లు, గోపురాలకు భారీగా ముడుపులు సమర్పించుకుంటున్నారు. పెద్దనోట్లు రద్దు తర్వాత దేశంలోని ఆలయాలన్నింటికీ పాతకరెన్సీరూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏ దేవుడి హుండీ చూసినా పాతకరెన్సీ కట్టలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని టాప్-10 ఆలయాల సంపద జాతికి అందజేస్తే.. దేశంలో పేదరిక సమస్యే ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని టాప్-10 ఆలయాలు.. వాటి సంపద వివరాలు ఇవి. పద్మనాభస్వామి ఆలయం - కేరళ దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. అనంతపద్మనాభుడి వద్ద ఎంతలేదన్న 20బిలియన్ డాలర్ల (రూ. Rs 13.60 లక్షల కోట్ల) సంపద ఉంటుందని అంచనా. తిరుమల తిరుపతి దేవస్థానం - ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకన్నకు ఏటా రూ. 650 కోట్లు విరాళాలరూపంలో అందుతున్నాయి. లడ్డూల అమ్మకం ద్వారానే ఏటా రూ. 75 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దేశంలో అత్యంత సంపన్నమైన రెండో దేవాలయంగా టీటీడీ విరాజిల్లుతోంది. షిర్డీ సాయిబాబా - మహారాష్ట్ర దేశంలో అత్యంత సంపన్నమైన మూడో ఆలయం షిరిడీ సాయినాథుడిదే. సాయిబాబా ఆలయం వద్ద రూ. 32 కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు రూ. 6 లక్షల విలువైన నాణెలు ఉన్నాయి. విరాళాల రూపంలో ఆలయానికి ఏటా రూ. 360 కోట్లు అందుతున్నాయి. వైష్ణోదేవి ఆలయం- జమ్మూ దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో వైష్ణోదేవి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ఏటా రూ. 500 కోట్లమేర విరాళాల రూపంలో అందుతున్నాయి. సిద్ధి వినాయక ఆలయం-ముంబై బాలీవుడ్ సెలబ్రిటీలు నిత్యం దర్శించుకునే ఈ ఆలయానికి ఏటా రూ. 48 కోట్ల నుంచి రూ. 125 కోట్ల వరకు విరాళాలు అందుతున్నాయి. స్వర్ణ దేవాలయం- అమృత్సర్ బంగారుతాపడంతో చేయించిన ఆలయం ఇది. ఇందులో కొలువైన సిక్కుల పవిత్ర పుస్తకమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో వజ్రాలు, విలువైన మణులు పొదిగిఉన్నాయి. మీనాక్షి ఆలయం- మధురై ఈ ఆలయాన్ని ఏటా 30వేలమంది దర్శించుకుంటారు. ఏడాదికి రూ. ఆరు కోట్ల ఆదాయం ఈ ఆలయానికి వస్తున్నది. జగన్నాథ ఆలయం-పూరి ఈ ఆలయం పూర్తి విలువ ఎంత ఉంటుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆలయంలో 130 కిలోల బంగారం, 220 కిలోల వెండి ఉందని చెప్తారు. జగన్నాథ రథయాత్రకు పేరొందిన పూరి ఆలయానికి గతంలో ఓ యూరప్ భక్తుడు రూ. 1.72 కోట్ల విరాళం అందజేశాడు. కాశీ విశ్వనాథ ఆలయం- వారణాసి ఈ ఆలయానికి మూడు గుమ్మటాలు ఉండగా, అందులో రెండు బంగారుతాపడంతో చేయించినవి. ఈ ఆలయానికి ఏటా విరాళాల రూపంలో రూ. 4 నుంచి 5 కోట్ల ఆదాయం వస్తుంది. సోమ్‌నాథ్ ఆలయం- గుజరాత్ గుజరాత్‌లోనే అత్యంత సంపన్నమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి ఏటా రూ. 33 కోట్ల ఆదాయం వస్తుంది. -
అనంత పద్మనాభుడిని మేలుకొల్పేదెలా?
న్యూఢిల్లీ: దేవదేవుడు విష్ణుమూర్తిని ఎలా నిద్రలేపాలనే అనేదానిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపు గంటపాటు వాడీవేడిగా చర్చించింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలా? వద్దా? అనే అంశంపై శనివారం ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ఆలయ కోశాధికార నిర్వహణ విషయమై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ప్రముఖ లాయర్ కేకే వేణుగోపాల్ ఆలయ ధర్మకర్త అయిన ట్రావెన్కోర్ రాజవంశం తరఫున వాదిస్తుండగా.. అమికస్ క్యూరీగా గోపాల్ సుబ్రహ్మణ్యం కోర్టుకు సహకరిస్తున్నారు. గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం అనంతపద్మనాభస్వామి ఆలయంలో పఠిస్తున్న సుప్రభాత శ్లోకాన్ని కొనసాగించాలని, ఈ శ్లోకంలో పలుచోట్ల పద్మనాభస్వామి గురించి ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. దీనితో విభేదించిన కేకే వేణుగోపాల్.. విష్ణుమూర్తి ఉన్నది 'యోగనిద్ర'లో అని, ఆయనను సుప్రభాతం పఠించి నిద్రలేపరాదని తెలిపారు. ఇలా సుప్రభాతం పఠించడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాల్లో భాగంకాని ఆచారాలను ప్రవేశపెట్టడం దురదృష్టకరమని, దీని ప్రభావం ఆలయ నిర్వహణ కమిటీపై పడే అవకాశముందని చెప్పారు. ఆయన వాదనలను గోపాల్ సుబ్రహ్మణం వ్యతిరేకించారు. వేంకటేశ్వర సుప్రభాతంలో పద్మనాభస్వామి ప్రస్తావన కూడా ఉందంటూ అందులోని కొన్ని పంక్తులను చదివి వినిపించారు. అయితే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి కోసమే సుప్రభాతాన్నిపఠిస్తారని, తిరుమలలో వేంకన్న విగ్రహం నిలబడి ఉండగా, పద్మనాభస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకొనే భంగిమలో ఉందని కేకే వేణుగోపాల్ చెప్పారు. ఈ వాదనలు ఆసాంతం విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం 'దేవుడిని ఎలా మేలుకొల్పుతారు, ఇందుకు ఏ పాటను పాడుతారు అన్నది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ అంశంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు. దీనిని ఆలయ ప్రధాన పూజారి నిర్ణయించనివ్వండి' అని పేర్కొంది. కేరళలోని ఈ ఆలయ నిర్వహణను ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని నేలమాళిగాలను తెరువగా భారీగా సంపద వెలుగులోకి వచ్చింది. రహస్యమైన తొమ్మిదో నేలమాళిగను మాత్రం ఇంకా తెరువలేదు. -
మదింపు జరగాల్సిందే
‘పద్మనాభ స్వామి’ ఆదాయ వ్యయాలపై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయ సంపద, పాలనా పరమైన అంశాలపై సుప్రీం కోర్టు గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు తప్పనిసరన్న కోర్టు.. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ నేతృత్వంలో ఆడిటింగ్ జరిపించాలని ఆదేశించింది. దీనికిగాను ప్రత్యేక ఆడిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అదేవిధంగా ఆలయానికి ఇప్పటి వరకు ఉన్న పాలక మండలిని రద్దు చేస్తూ జిల్లా జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ కుమార్‌ను ఆలయ ఎగ్జిక్యూటివ్(ఈవో) అధికారిగా నియమించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ ఎ.కె.పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1.ఆలయంలో జరుగుతున్న అవకతవకలు, పాలనా పరమైన లోపాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం సమర్పించిన నివేదికపై రెండో రోజు గురువారం కూడా సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. 2. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్వామికి చెందిన సంపదను పరాధీనం చేయడం, అమ్మడం వంటివి చేయరాదని ప్రతి వస్తువునూ భద్రపరచాలని ఆదేశించింది. 3. తిరువనంతపురం జిల్లా జడ్జి హిందూ వర్గానికి చెంది ఉండని పక్షంలో హిందూ వర్గానికి చెందిన తదుపరి సీనియర్ జడ్జి చైర్మన్‌గా నూతన పాలక మండలిని ఏర్పాటు చేయాలంది. 4. సుప్రీం ఆదేశాలను శిరసావహిస్తామని కేరళ సీఎంఊమెన్ చాందీ చెప్పారు. అయితే, ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని అవమాన పరిచే ధోరణిని తాము సహించబోమన్నారు.