తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్‌ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.
తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV
— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు.
"మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment