denied entry
-
Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ
తిరువనంతపురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్‌ప్రీత్ అనే మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భర్తతో పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సిబ్బంది.. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్రమే ఆలయ అనుమతి ఉంటుందని అధికారులు చెప్పినట్లు వీడియోలో పేర్కొంది. తనతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇండియన్ అయిన ఆమె ప్రియుడు చెప్పినా.. ఆలయ సిబ్బంది ఆ విదేశీ మహిళకు గుడిలోకి అనుమతి ఇవ్వలేదు.తాను హిందువునే అని ఆ మహిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు సర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భారతీయుడిని పెళ్లి చేసుకోబోతున్నానని, భగవద్గీతను చదవుతానని, అయినా సెక్యూర్టీ గార్డులు తనను ఓ నేరస్థురాలిగా చూస్తున్నారని ఆమె తన వీడియోలో ఆరోపించింది. ఆలయ అధికారులు వర్ణవివక్షను ప్రదర్శించినట్లు ఆరోపించింది. కేవలం ఆలయంలో ప్రవేశించేందుకు మాత్రమే చీరను కొన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.Why should anyone be barred from a place worship they want to visit? https://t.co/Y6LrCCJUwV— Karti P Chidambaram (@KartiPC) July 16, 2024 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు. "మతం, జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇస్తే ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. -
పరీక్షకు ఆలస్యం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
జైనథ్: పరీక్షకు ఆలస్యం కావడంతో ఆవేదన చెందిన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్సయ్యాను. క్షమించు నాన్నా..’అంటూ లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకాడు. గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల రెండో కుమారుడు శివకుమార్ (16). ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్ సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మొదటి పరీక్ష ఉండగా.. ఉదయం 8.30గంటలకు గ్రామం నుంచి ఆటోలో ఆదిలాబాద్‌కు బయల్దేరాడు. మధ్యలో ఉండగా ఆలస్యం అవుతోందని ఆవేదన చెందాడు. ఆ సమయంలో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ పరిచయమున్న వ్యక్తి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్‌చౌక్ వద్దకు చేరుకునే సరికే.. సమయం 9 గంటలు దాటిపోయింది. అక్కడే దిగిపోయిన శివకుమార్.. టీఎస్టీడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆలస్యం కావడంతో పరీక్షకు రానివ్వరని దిగులు చెందాడు. ఆటో ఎక్కి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు వద్ద ఆటో దిగాడు. సూసైడ్ నోట్ రాసి, దానితోపాటు చేతి వాచీ, పెన్ను, పర్సు వంటివి ఒడ్డుపై ఉంచి ప్రాజెక్టులో దూకేశాడు. కాసేపటికి దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నం సమయంలో శివకుమార్ మృతదేహం లభ్యమైంది. ‘‘నాన్నా నన్ను క్షమించు.. నాకోసం ఎంతో చేశావు.. నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను.. జీవితంలో మొదటిసారి ఎగ్జామ్ మిస్ అయ్యాను..’’అని శివకుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పరీక్షకు ఆలస్యంగా వెళ్తే రానివ్వరనే ఆందోళనతో శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సంప్రదాయ దుస్తులు ధరించారని..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హై క్లాస్ రెస్టారెంట్లో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రాధారణలో రెస్టారెంట్‌కు వెళ్లినా ఆమెను అక్కడి సిబ్బంది లోనికి అనుమతించలేదు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని పాత్‌వేస్ సీనియర్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సంగీత కె నాగ్ ఇటీవల కైలీన్ మరియు ఐవీ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టారెంట్ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని లోనికి అనుమతించకపోవడంతో.. అందుకు సంబంధించిన ఓ వీడియోను సంగీత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎథినిక్ వేర్ ధరించినందుకు మాల్‌లోకి ప్రవేశించకుండా చేశారు. భారత్‌లోని ఓ రెస్టారెంట్.. విదేశీ వస్త్రధారణకు విలువ ఇస్తుంది. ఏది ఎమైనా ఒక ఇండియన్‌గా నేను గర్వపడతాను’ అని సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో సదరు రెస్టారెంట్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్ చేసిన తప్పును దిద్దుకునే పనిలో పడింది. సంగీతకు క్షమాపణలు చెపుతు రెస్టారెంట్ యాజమాన్యం ఓ సందేశాన్ని పంపింది. తాత్కాలిక ఉద్యోగి వల్ల ఈ పొరపాటు జరిగినట్టు పేర్కొంది. ఈ విషయంపై లోతుగా విచారిస్తామని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని తెలిపింది. అలాగే తమ క్షమాపణను అంగీకరించాల్సిందిగా సంగీతను కోరారు. Thank you for reaching out to apologise for the incident last evening @KhanijoSaurabh pic.twitter.com/NyEh3gusVz — Sangeeta K Nag (@sangeetaknag) March 11, 2020 -
కన్హయ్య కుమార్ ఏమైనా ఉగ్రవాదా..?
ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ విజిటర్స్ గ్యాలరీలోకి అనుమతించకపోవడంపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సభలోకి కన్హయ్యను అనుమతించకపోవడానికి అతనేమైనా ఉగ్రవాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నదీన్ ఖాన్ విమర్శించారు. బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నదీన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కన్హయ్య ఉగ్రవాది కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ కార్యకలాపాలను వీక్షించవచ్చని చెప్పారు. అసెంబ్లీలోకి వచ్చేందుకు కన్హయ్యకు పాస్ ఉందని, అతన్ని అనుమతించకపోవడానికి తగిన కారణంలేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ బగడే స్పందిస్తూ.. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుని పరిశీలిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ కన్హయ్యను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం సిగ్గుమాలిన చర్య అని విరుచుకుపడ్డారు. కన్హయ్యను అడ్డుకున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న విద్యార్థి సంఘం కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్హయ్య ముంబై వచ్చాడు. ఈ విషయంపై కన్హయ్య స్పందిస్తూ.. విధాన సభ కార్యకలాపాలు చూడాలని కోరానని, ప్రత్యేకించి సభలో విదర్భపై జరిగే చర్చ వినాలనుకున్నానని, అయితే తనను అనుమతించలేదని చెప్పాడు.