Keshav Maharaj Visits Sri Padmanabha Mandir in Trivandrum - Sakshi
Sakshi News home page

IND Vs SA: పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్‌ స్పిన్నర్‌

Published Tue, Sep 27 2022 1:05 PM | Last Updated on Tue, Sep 27 2022 1:39 PM

 Keshav Maharaj visits Sri Padmanabha Mandir in Trivandrum - Sakshi

టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్‌ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బుధవారం తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది.

ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికా స్టార్‌ స్పిన్నర్‌ కేశవ్ మహరాజ్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను  మహరాజ్ తన సోషల్‌ మీడియా ఖాతాలో షోర్‌ చేశాడు. అదే విధంగా తన అభిమానులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు. కాగా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి.

కాగా 32 ఏళ్ల కేశవ్‌ మహరాజ్‌ భారత మూలాలు కలిగి ఉన్నాడు. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కాగా అతడి కుటంబం తన చిన్నతనంలోనే  సౌతాఫ్రికాలో స్థిరపడింది. కాగా 2016లో ప్రోటీస్‌ జట్టు తరపున మహరాజ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు:
టీ20 జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, జానేమన్‌ మలన్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, పెహ్లుక్వాయో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, తబ్రేజ్‌ షంసీ.

వన్డే జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, రీలీ రోసోవ్‌, తబ్రేజ్‌ షంసీ, జోర్న్‌ ఫార్చూన్‌, పెహ్లుక్వాయో, మార్కో జాన్‌సేన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.


చదవండి: T20 WC 2022: దినేశ్‌ కార్తిక్‌ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement