
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సంచలన బంతితో మెరిశాడు. ఓ అద్భతమైన బంతితో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మహారాజ్ వేసిన బంతికి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పవర్ ప్లే ముగిసిన వెంటటే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా స్పిన్నర్ మహారాజ్ చేతికి బంతి ఇచ్చాడు.
11 ఓవర్‌లో మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో గిల్ ఆట్‌సైడ్ లెగ్ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో గిల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: CWC 2023: 35వ వసంతంలోకి 'కింగ్ కోహ్లి'.. పుట్టిన రోజున సచిన్ రికార్డు సమం చేసేనా..?
— Cricket Videos Here (@CricketVideos98) November 5, 2023