మలయాళ చిత్ర ఓపెనింగ్ సందర్భంగా పద్మనాభస్వామిని దర్శించుకున్న రానా
బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న 1945, హాథీమేరి సాథీ సినిమాల్లో నటిస్తున్న రానా.. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకొచ్చాడు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ట్రావెన్ కోర్ రాజు మార్తండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో రాజా మార్తండ వర్మగా నటిస్తున్నాడు రానా. 18వ శతాబ్ధంలో జరిగిన కథతో భారీ చారిత్రక చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె.మధు. ఈ సినిమాకు మార్తండ వర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా 2018లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment