
ముంబై: లాక్‌డౌన్ కాలంలో పేదల అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన అనుచరులకు ముఖ్యమైన ప్రకటన జారీ చేశారు. తన పేరు మీద విరాళాలు వసూలు చేస్తున్న ఓ ఫౌండేషన్ గురించి ఆయన హెచ్చరించారు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో, తన ఫొటోను పెట్టుకున్న ఓ నకిలీ సంస్థకు చెందిన వ్యక్తులు విరాళాలు వసూలు చేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ సంస్థ గురించి తెలిస్తే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment