
హైదరాబాద్ : ఫేస్‌బుక్‌లో కనిపించే ఖాతాల్లో ఎక్కువశాతం నకిలీవేనట. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. 2017 డిసెంబరు 31 వరకు ఫేస్‌బుక్‌లో ఉన్న ఖాతాల్లో 20 కోట్లమంది ఫేక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. మొత్తం ఖాతాల్లో దాదాపు 10 శాతం ఖాతాలు బహుశా నకిలీవై ఉంటాయని ఆ సంస్థ భావించినా.. అంతకు మించే ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. భారత్ వంటి దేశాల్లో ఇటీవల ఫేక్ ఖాతాల సంఖ్య బాగా పెరిగిపోతోందని వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇండియాతోపాటు, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయట. 2016తో పోలిస్తే నకిలీ ఖాతాల సంఖ్య 14 శాతం పెరిగిందట. వ్యాపారం, ఇలా నకిలీ ఖాతాలు సృష్టించి, వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. తమ సంస్థ నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలన్నింటినీ త్వరలోనే నిలిపివేస్తామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment