ఫేక్‌ టిక్‌టాక్‌ అకౌంట్స్‌.. నటి హెచ్చరిక!  | Munmun Dutta Warns Fans Over Her Fake Tiktok Accounts | Sakshi
Sakshi News home page

ఫేక్‌ టిక్‌టాక్‌ అకౌంట్స్‌.. నటి హెచ్చరిక! 

Published Sun, Apr 26 2020 8:07 PM | Last Updated on Sun, Apr 26 2020 8:28 PM

Munmun Dutta Warns Fans Over Her Fake Tiktok Accounts - Sakshi

ప్రముఖుల పేరిట సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు పుట్టుకురావటం సర్వసాధారణం. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి మున్‌మున్‌ దత్తా పేరిట టిక్‌టాక్‌లో కొన్ని ఫేక్‌ అకౌంట్లు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మున్‌మున్‌ ఇబ్బందిగా ఫీలయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులను హెచ్చరించారు. తన పేరిట ఉన్న ఫేక్‌ టిక్‌టాక్‌ అకౌంట్ల స్ర్కీన్‌ షాట్లను షేర్‌ చేశారు. ( అమితాబ్‌ ట్వీట్‌.. మండిపడ్డ అభిమానులు )

మున్‌మున్‌ పేరిట టిక్‌టాక్‌లో ఉన్న ఫేక్‌ అకౌంట్లు

‘‘ నేను టిక్‌టాక్‌లోకి రావాలనుకుంటే కచ్చితంగా నా ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ తెలియజేస్తా. అంతవరకు ఫేక్‌ అకౌంట్లకు దూరంగా ఉండండి’’ అని అన్నారు. మున్‌మున్‌ ‘‘ తారక్‌ మెహ్తా కా ఉల్టా చెస్మా’’ సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యారు. ఈ సీరియల్‌ గత 11 సంవత్సరాల నుంచి టెలికాస్ట్‌ అవుతూనే ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement