ఫేస్బుక్ వేధింపులు: యువతి అరెస్టు
స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి, వాళ్ల ఫొటోలతో అసభ్య సందేశాలు పోస్ట్ చేస్తూ వాళ్ల పరువు గంగలో కలుపుతున్న 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టుచేశారు. మొత్తం ఎనిమిది మంది పేర్ల మీద నకిలీ ఫేస్బుక్ ఐడీలను ఆమె తెరిచింది. అయితే.. ఆమె ప్రాక్సీ సర్వర్లను ఉపయోగించి ఈ అకౌంట్లను క్రియేట్ చేయడంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడం పెద్ద సవాలుగానే మారింది.
ఎట్టకేలకు ఆమె ఆచూకీని తెలుసుకోగలిగినట్లు గోవా సైబర్ క్రైం ఎస్పీ కార్తీక్ కశ్యప్ తెలిపారు. ఈ నేరం చేయడానికి ఆమె ఉపయోగించిన పరికరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేయడం అలవాటు. ఎవరూ తనను ట్రాక్ చేయకుండా ఉండేందుకు తెల్లవారుజామున ఈ నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేయడం, వాటిలో పోస్టింగులు అన్నీ చేసేదని, అసలు ఆమె ఇలా చేయడానికి గల కారణం ఏంటో చూస్తున్నామని కశ్యప్ చెప్పారు.